Guardian : హన్సిక సూపర్ హారర్ థ్రిల్లర్ సినిమా ‘గార్డియన్’.. ఇప్పుడు ఆహా ఓటీటీలో..

హన్సిక మోత్వానీ మెయిన్ లీడ్ గా తమిళ్ లో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ సినిమా 'గార్డియన్'.

Hansika Motwani Horror Thriller Tamil Movie Guardian Telugu Version Streaming in Aha OTT

Guardian : గురు శరవణన్ దర్శకత్వంలో హన్సిక మోత్వానీ మెయిన్ లీడ్ గా తమిళ్ లో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ సినిమా ‘గార్డియన్’. తమిళ్ లో 2024 మార్చ్ 8న రిలీజయి అక్కడ ప్రేక్షకులను భయపెట్టింది ఈ సినిమా. గార్డియన్ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను భయపెట్టడానికి వచ్చేసింది.

హన్సిక గార్డియన్ సినిమా ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. భవాని మీడియా ద్వారా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక ఆత్మ రివెంజ్ తీర్చుకోడానికి తిరిగొచ్చి హన్సిక శరీరంలోకి వెళ్లి ఏం చేసింది, ఎవర్ని భయపెట్టింది అని హారర్ సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమాకి సామ్ సి.ఎస్. అదిరిపోయే హారర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు.

Also Read : Nikhil – Kavya : ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందా? ఎవరి జీవితాలు వాళ్ళవి అంటూ నిఖిల్ పోస్ట్..

హారర్ సినిమాలు ఇష్టపడేవాళ్లు గార్డియన్ తెలుగు వెర్షన్‌ ని ఆహా లో చూసేయండి.