Nikhil – Kavya : ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందా? ఎవరి జీవితాలు వాళ్ళవి అంటూ నిఖిల్ పోస్ట్..
నిఖిల్ తనతో పాటు గోరింటాకు సీరియల్ లో నటించిన కావ్యతో ప్రేమలో ఉన్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి.

Serial Actors Nikhil Maliyakkal Kavya Shree Breakup Rumors goes Viral after Nikhil Instagram Story
Nikhil – Kavya : గోరింటాకుతో పాటు పలు సీరియల్స్, బిగ్ బాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్ మళియక్కల్. నిఖిల్ తనతో పాటు గోరింటాకు సీరియల్ లో నటించిన కావ్యతో ప్రేమలో ఉన్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి అనేక షోలలో జంటగా పాల్గొన్నారు. బయట కూడా వీళ్ళు చాలా క్లోజ్ గా ఉన్నారు. ఒకరికి ఒకరు ఫుల్ సపోర్ట్ అని పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. కానీ ఇదంతా బిగ్ బాస్ ముందు వరకు.
బిగ్ బాస్ లో నిఖిల్ తన లవ్ ఫెయిల్యూర్ అయిందని, అయినా నాకు ఆ అమ్మాయే కావాలని ఉందని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. పేరు చెప్పలేదు కానీ కావ్య గురించే అని అంతా అనుకున్నారు. బిగ్ బాస్ తర్వాత షో, సీరియల్స్ లలో తప్ప నిఖిల్ – కావ్య కలిసి ఎక్కడా కనపడలేదు. ఈ జంటకు అభిమానులు కూడా ఉన్నారు, వీళ్లకు ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి. అయితే వీరి ఫ్యాన్స్ ఈ ఇద్దర్ని ట్యాగ్ చేస్తూ పలు పోస్టులు పెడుతుండటంతో నిఖిల్ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
Also Read : Kushitha Kallapu : SRH కోసం వెళ్లి.. ముంబై కెప్టెన్ తో ఫోటో దిగొచ్చిన హీరోయిన్..
నిఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మీ అందరి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. కానీ నాదొక రిక్వెస్ట్. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతున్నాము. కాబట్టి మమ్మల్ని వ్యక్తిగతంగానే సపోర్ట్ చేయండి, ప్రేమించండి. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీ అందర్నీ రిక్వెస్ట్ చేస్తున్నాను నన్ను ఎవరితోనూ ట్యాగ్ చేయకండి, వర్క్ విషయంలో కాకుండా వేరే ఏ పోస్ట్ లలోను నన్ను ఎవరితోనూ లింక్ చేయకండి, ట్యాగ్ చేయకండి. మీరు అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను అని రాసుకొచ్చాడు.
దీంతో నిఖిల్ పోస్ట్ వైరల్ గా మారింది. అతని ఫ్యాన్స్ కేవలం కావ్యతోనే ట్యాగ్ చేసి పోస్టులు చేస్తారు. నిఖిల్ ఎవ్వరితో ట్యాగ్ చేయొద్దు అనడంతో ఇండైరెక్ట్ గా కావ్యతో ట్యాగ్ చేయొద్దని చెప్తున్నాడు అని భావిస్తున్నారు. దీంతో నిఖిల్ – కావ్య నిజంగానే విడిపోయారని అనుకుంటున్నారు. ఎందుకు విడిపోయారు ఇంత మంచి జంట అని పలువురు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై కావ్య స్పందిస్తుందా చూడాలి.