Kushitha Kallapu : SRH కోసం వెళ్లి.. ముంబై కెప్టెన్ తో ఫోటో దిగొచ్చిన హీరోయిన్..
ముంబై - హైదరాబాద్ మ్యాచ్ నేపథ్యంలో నటి కుషిత కళ్లపు పోస్ట్ వైరల్ గా మారింది.

Kushitha Kallapu Went for SRH MI Match Shared Photo with Hardik Pandya
Kushitha Kallapu : ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా నిన్న బుధవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగగా ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. హైదరాబాద్ మ్యాచ్ అంటే మన టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా రెగ్యులర్ గా చాలా మంది వెళ్తుంటారని తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో నటి కుషిత కళ్లపు పోస్ట్ వైరల్ గా మారింది.
సోషల్ మీడియాతో ఫేమ్ తెచ్చుకున్న కుషిత కళ్లపు ప్రస్తుతం హీరోయిన్ గా పలు చిన్న సినిమాల్లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ పాపులర్ అయింది. ఈ భామ ముందు నుంచి SRH కి సపోర్ట్ చేస్తూ అప్పుడప్పుడు పోస్టులు పెడుతుంది. నిన్న కూడా ముంబై – హైదరాబాద్ మ్యాచ్ కి SRH గెలవాలంటూ వెళ్ళింది, స్టేడియంలో హడావిడి చేసింది, SRH ఓడిపోయిన తర్వాత ఏడ్చింది కూడా.
అయితే మ్యాచ్ అయిపోయాక కుషిత ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో ఫోటో దిగింది. తను మ్యాచ్ లో ఎంజాయ్ చేసిన పలు ఫొటోలతో పాటు హార్దిక్ పాండ్యతో దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. అతని స్మైల్ బాగుంది అంటూ పోస్ట్ చేసింది కుషిత. దీంతో కుషిత పోస్ట్ వైరల్ గా మారింది. హార్దిక్ తో ఫోటో దిగడం తప్పు కాదు కానీ SRH గెలవాలి అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేసి, ఓడిపోయాక ఏడ్చిన కుషిత ఇలా హార్దిక్ పాండ్యతో ఫోటో పోస్ట్ చేసి అతని స్మైల్ ని పొగడటంతో SRH ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
Also Read : South Stars : ఇది గమనించారా..? పాపులర్ కూల్ డ్రింక్స్ అన్నిటికి సౌత్ స్టార్లే బ్రాండ్ అంబాసిడర్లు..