Imanvi Esmail : ప్రభాస్ సినిమాపై ఉగ్రదాడి ఎఫెక్ట్.. కేంద్ర ఆదేశాలతో ఫౌజీ హీరోయిన్ పాకిస్తాన్ వెళ్లిపోవాల్సిందేనా?
ఈ ఎఫెక్ట్ ప్రభాస్ ఫౌజీ సినిమాపై పడనుంది అని సందేహాలు వస్తున్నాయి.

Terrorist Attack effect on Prabhas Movie Netizens Fires on Fauji Actress Imanvi
Imanvi Esmail : మంగళవారం నాడు కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ పై ప్రతి చర్యలకు దిగింది. ఈ క్రమంలో కేంద్ర భద్రతా వ్యవహారాల క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలలో పాకిస్తాన్ వాసులకు భారత్ లోకి ఎంట్రీ లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న పాకిస్తాన్ పౌరులు, టూరిస్టులు వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసారు. పాక్ కు చెందిన ప్రత్యేక వీసాదారులు 48 గంట్లలో భారత్ ను విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు.
అయితే ఈ ఎఫెక్ట్ ప్రభాస్ ఫౌజీ సినిమాపై పడనుంది అని సందేహాలు వస్తున్నాయి. ప్రభాస్ – హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఇమాన్వి ఇస్మాయిల్ అనే అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ అమ్మాయి పాకిస్తాన్ అని, ఆమె తండ్రి గతంలో పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇంటర్నెట్ లో కూడా ఇదే చూపించడంతో ఇమాన్వి పాకిస్తాన్ కి చెందిన మహిళ అని, ఆమె పాకిస్తాన్ కి వెళ్లిపోతుందా అని సందేహం వ్యక్తపరుస్తున్నారు.
Also Read : Advertisements : యాడ్స్ చేయాలంటే భయపడుతున్న సెలబ్రిటీలు.. యాడ్స్ కాస్తా కేసులు, వివాదాలుగా మారుతుండటంతో..
అంతేకాకుండా ఉగ్రదాడి నేపథ్యంలో బాలీవుడ్ లో, ఇక్కడ ఇమాన్విని.. ఇలా పాకిస్తాన్ నటులను ఎందుకు తీసుకుంటున్నారు, వాళ్ళని సినిమాల్లోంచి తీయాలని విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. మరి దీనిపై ఇమాన్వి స్పందిస్తుందా? లేదా మూవీ యూనిట్ స్పందిస్తుందా చూడాలి. అయితే ఇమాన్వి తండ్రి ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయినట్టు సమాచారం.
Pakistani actress Iman Esmail to debut Telugu film Fauji with Prabhas.
I request all Telugu friends, regardless of their ideology, to not allow Pakistani garbages in the Telugu industry. pic.twitter.com/WTTAc3FUiD
— Anshul Pandey (@Anshulspiritual) April 23, 2025
ఆమెకు పాకిస్తాన్ పౌరసత్వం లేకపోతే, ఆమెది పాకిస్తాన్ కాకపోతే అధికారికంగా స్పందించాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ ఉగ్రదాడి ఘటన, ప్రభుత్వ ఆదేశాలు ప్రభాస్ సినిమాకు ఎఫెక్ట్ అయ్యేలా ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.
@hanurpudi garu, @MythriOfficial and @TrendsPrabhas a lot of misconceptions are spreading on the nationality of #PrabhasHanu movie heroine #Imanvi.. Please bringout an official clarification about her nationality, before the negativity goes to peak… pic.twitter.com/5Hx1oH2b2e
— తెలుగు చిత్రమాల | Telugu Chitramala🚩 (@Tel_Chitramala) April 23, 2025