Tollywood Graphics Movies : ఇవన్నీ గ్రాఫిక్స్ సినిమాలే.. సగం బడ్జెట్ VFXకే.. టాలీవుడ్ అప్ కమింగ్ భారీ VFX సినిమాలు ఇవే..

ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల్లో గ్రాఫిక్స్, VFX మేజర్ పార్ట్ అవుతోంది.

Tollywood Graphics Movies : ఇవన్నీ గ్రాఫిక్స్ సినిమాలే.. సగం బడ్జెట్ VFXకే.. టాలీవుడ్ అప్ కమింగ్ భారీ VFX సినిమాలు ఇవే..

Tollywood Movies Preparing with Huge Graphics and VFX

Updated On : April 23, 2025 / 8:29 PM IST

Tollywood Graphics Movies : యాక్టర్లు సినిమాకి కావల్సినంత ఎమోషన్ ఇస్తే గ్రాఫిక్స్ సినిమాకి కావల్సింత ఎలివేషన్ యాడ్ చేసి ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తాయి. అందుకే ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల్లో గ్రాఫిక్స్ మేజర్ పార్ట్ అవుతోంది. దీనికోసం వందలకోట్ల బడ్జెట్ కూడా పెడుతున్నారు.

గ్రాఫిక్స్ అంటే రాజమౌళి, రాజమౌళి అంటే గ్రాఫిక్స్. ఆ రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు జక్కన్న. ఈగ, బాహుబలి, RRR సినిమాలతో సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన రాజమౌళి దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న మహేశ్ బాబు సినిమాకి అంతకుమించి చూపించబోతున్నారు. ఈ సినిమాకి వీఎఫ్ఎక్స్ కే 200కోట్లు పెట్టడం గ్యారంటీ అంటున్నారు.

Also Read : South Stars : ఇది గమనించారా..? పాపులర్ కూల్ డ్రింక్స్ అన్నిటికి సౌత్ స్టార్లే బ్రాండ్ అంబాసిడర్లు..

ఇప్పటి వరకూ పెద్దగా విజువల్ ఎఫెక్ట్స్ మీద డిపెండ్ అవ్వని అల్లు అర్జున్ ఈసారి మాత్రం అప్ కమింగ్ ప్రాజెక్ట్ లో అదరగొట్టే ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నారు. అట్లీ, బన్నీ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించి హాలీవుడ్ సంస్థ తో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. సినిమా అనౌన్స్‌మెంట్ లోనే అవతార్, అవెంజర్స్ లాంటి క్రేజీ విజువల్స్ చూపించడంతో సినిమా గ్యారంటీగా విజువల్ గా ట్రీట్ ఇవ్వబోతోందని తెలుస్తోంది. 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈజీగా 150 కోట్లు VFX కోసమే అని న్యూస్.

షూటింగ్ అయిపోయినా VFX పని అవ్వకపోవడం వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ అవుతున్న సినిమాల్లో చాలానే ఉన్నాయి. వాటిలో ఫస్ట్ ప్లేస్ రాజాసాబ్ దే. ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న రాజాసాబ్ హార్రర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు అయిపోయిందని, గ్రాఫిక్స్ వర్కే టైమ్ పడుతోందని, 3 టీమ్స్ పనిచేస్తున్నాయని క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ మారుతి. 300 కోట్లబడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మ్యాగ్జిమమ్ అంతా VFX వర్కే ఉందని తెలుస్తోంది.

ఈ సమ్మర్ లో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్న హరిహరవీరమల్లు లో కూడా గ్రాఫిక్స్ మేజర్ పార్ట్ కాబోతోంది. పవన్ కళ్యాణ్, జ్యోతికృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు హిస్టారికల్ యాక్షన్ డ్రామా కాబట్టి అప్పటి నేటివిటీని క్రియేట్ చెయ్యడం, యాక్షన్ సీన్స్, యాంబియెన్స్ కోసం గ్రాఫిక్స్ వాడాల్సిందే. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్, టీజర్స్ లో గ్రాఫిక్స్ క్వాలిటీతో ఉండడంతో ఇక ఫుల్ సినిమాలో విజువల్స్ ఎలా ఉంటాయో అని ఆసక్తిగా చూస్తున్నారు ఆడియన్స్. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ కి 100 కోట్లు పెడుతున్నట్టు తెలుస్తోంది.

Also Read : Indhra Ram : RX 100 సినిమా నేను చేయాలి.. డైరెక్టర్ నాతో ట్రావెల్ చేసాడు.. కానీ..

విశ్వంభర సినిమాకి బడ్జెట్ లో సగం VFX కే పెడుతున్నారు. చిరంజీవి, వశిష్ట కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ సినిమా 150కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అయితే గ్రాఫిక్స్ కోసమే 75కోట్ల బడ్జెట్ పెడుతున్నట్టు వినిపిస్తోంది. గ్లింప్స్ తర్వాత VFX విషయంలో ట్రోల్స్ రావడంతో ఇప్పటికే మల్టిపుల్ కరెక్షన్స్ చేస్తున్న విశ్వంభర టీమ్ ఈ సారి ఎలాంటి నెగెటివిటీకి చాన్స్ లేకుండా సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి చూస్తోంది.

రాజమౌళి రేంజ్ గ్రాఫిక్స్ ని చూపించి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన సినిమా హనుమాన్. ఇప్పుడు హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ రాబోతోంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విజువల్ వైజ్ గా ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది. తక్కువ బడ్జెట్ లోనే బెటర్ విజువల్స్ ఇస్తున్న ప్రశాంత్ వర్మ జై హనుమాన్ లో ఇంకేం చూపిస్తాడో అన్న క్యూరియాసిటీ ఉంది జనాల్లో.

ఈ సంవత్సవరం రాబోతున్న ఇంట్రస్టింగ్ గ్రాఫికల్ మూవీస్ లో అఖండ 2 కూడా ఒకటి. బాలయ్య, బోయపాటి క్రేజీ కాంబినేషన్లో పవర్ ఫుల్ గా వస్తున్న అఖండ సీక్వెల్ ఈ సారి ఫస్ట్ పార్ట్ ని మించిన విజువల్స్ తో రెడీ అవుతోంది. అఖండలోనే అమేజింగ్ విజువల్స్ చూపించిన టీమ్ అఖండ 2 లో నెక్ట్స్ లెవల్ VFX చూపించబోతోందంటున్నారు ఫ్యాన్స్.

Also Read : RJ Kajal : పహల్గాంలో బిగ్ బాస్ తెలుగు భామ.. నేను క్షేమం అంటూ వీడియో విడుదల చేసిన ఆర్జే కాజల్..

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న కన్నప్ప ని నెక్ట్స్ లెవల్ సినిమాగా హైప్ చేస్తున్నారు. కంటెంట్ సంగతి పక్కన పెడితే విజువల్స్ విషయంలో ట్రోలింగ్ జరుగుతోంది. గ్రాఫిక్స్, VFX మరీ పూర్ గా ఉన్నాయని, ఇంకా బెటర్ గా ఉండొచ్చంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అందుకే ఇంకా కరెక్షన్స్ చేస్తూ ఇంప్రూవ్ చేసే పనుల్లో ఉంది టీమ్. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మ్యాసివ్ స్టార్ కాస్ట్ మూవీ జూన్ 27న థియేటర్లోకొస్తోంది.

సాయిదరమ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీగా రాబోతున్న సంబరాల ఏటిగట్టు విజువల్ గా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది. ఎందుకంటే ఈ సినిమాలో మేజర్ పార్ట్ గ్రాఫిక్సే ఉండబోతున్నాయి. పీరియాడికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ 120 కోట్లైతే VFX కి 25 కోట్లు పైనే పెడుతున్నారని తెలుస్తోంది. ఇలా క్వాలిటీ గ్రాఫిక్స్ కోసం భారీ బడ్జెట్ ఖర్చుపెట్టి ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నాయి సినిమాలు.