South Stars : ఇది గమనించారా..? పాపులర్ కూల్ డ్రింక్స్ అన్నిటికి సౌత్ స్టార్లే బ్రాండ్ అంబాసిడర్లు..

బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఉన్నా ఇటీవల సౌత్ స్టార్లే రూల్ చేస్తున్నారు.

South Stars : ఇది గమనించారా..? పాపులర్ కూల్ డ్రింక్స్ అన్నిటికి సౌత్ స్టార్లే బ్రాండ్ అంబాసిడర్లు..

Allu Arjun Ram Charan Mahesh Babu Nani Yash All South Stars Ruling National Wide Cool Drinks Promotions

Updated On : April 23, 2025 / 7:27 PM IST

South Stars : ఇటీవల మన టాలీవుడ్, సౌత్ సినీ పరిశ్రమ వరుస విజయాలు సాధించడం, బాలీవుడ్ లో కూడా మన సినిమాలు హిట్స్ కొడుతుండటంతో మన హీరోలు, హీరోయిన్స్ ఆల్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకుంటున్నారు. దీంతో చాలా కంపెనీలు తమ మార్కెటింగ్ కోసం మన సినిమా సెలబ్రిటీలనే వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్లు గా పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా కూల్ డ్రింక్స్ కి చాలా వరకు సౌత్ స్టార్స్ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఉన్నా ఇటీవల సౌత్ స్టార్లే రూల్ చేస్తున్నారు. ప్రస్తుతం థమ్స్ అప్ కి అల్లు అర్జున్ నేషనల్ వైడ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. పుష్పతో బన్నీ నేషనల్ వైడ్ స్టార్ డమ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దాంతో బాలీవుడ్ స్టార్స్ ని కాదని అల్లు అర్జున్ కి నేషనల్ వైడ్ థమ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఇచ్చారు. గతంలో చిరంజీవి, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు కూడా థమ్స్ అప్ కి యాడ్స్ చేసిన వాళ్లే.

Also Read : Indhra Ram : RX 100 సినిమా నేను చేయాలి.. డైరెక్టర్ నాతో ట్రావెల్ చేసాడు.. కానీ..

మౌంటెన్ డ్యూ కూల్ డ్రింక్ కి మహేష్ బాబు చాలా కాలంగా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఇటీవలే నార్త్ కి సపరేట్ గా హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్ లతో ఓ యాడ్ చేశారు. సౌత్ లో ఇప్పటికి మహేష్ బాబే మౌంటెన్ డ్యూ బ్రాండ్ అంబాసిడర్.

ఎప్పుడూ బాలీవుడ్ స్టార్స్ ని తీసుకునే కోకో కోలా కూల్ డ్రింక్ ఈ సారి యశ్ ని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుంది. KGF తో నేషనల్ వైడ్ స్టార్ డమ్ తెచ్చుకున్న యశ్ ఇప్పుడు కోకో కోలాకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.

తాజాగా రిలియన్స్ ఇండస్ట్రీస్ నుంచి వస్తున్న కంపా కూల్ డ్రింక్ కి రామ్ చరణ్ ని నేషనల్ వైడ్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్టు అధికారికంగా ప్రకటించి యాడ్ కూడా రిలీజ్ చేశారు. RRR తో చరణ్ నార్త్ లో బాగా కనెక్ట్ అయిన సంగతి తెలిసిందే.

Also Read : Eshwar Harris : నేనే ఎన్టీఆర్ కి బాడీ డబుల్.. RRR సినిమాలో, ఆ యాడ్ లో నేనే చేశా.. వార్ 2 రిజెక్ట్ చేశా.. ఎవరితను..?

గతంలో 7UP కూల్ డ్రింక్ కి రష్మిక బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది. పూజ హెగ్డే, నాగార్జున కూడా మజా కూల్ డ్రింక్ కి బ్రాండ్ అంబాసిడర్లు గా చేశారు. మినిట్ మెయిడ్ పల్పీ ఆరెంజ్ కి నాని ఇటీవలే బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్ చేసాడు. సౌత్ మొత్తానికి నానినే బ్రాండ్ అంబాసిడర్. నార్త్ వరకు మాత్రం శ్రద్ధ కపూర్ ని తీసుకున్నారు.

ఇలా ఆల్మోస్ట్ పెద్ద కూల్ డ్రింక్ కంపెనీలు అన్ని మన టాలీవుడ్, సౌత్ స్టార్స్ నే బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకొని ప్రమోట్ చేస్తున్నాయి. ఈ విషయంలో వారి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ ప్రమోషన్స్ కి మన టాలీవుడ్, సౌత్ స్టార్స్ స్టార్ డమ్ ని బాగానే క్యాష్ చేసుకుంటున్నారు కూల్ డ్రింక్ కంపెనీలు.

Also Read : RJ Kajal : పహల్గాంలో బిగ్ బాస్ తెలుగు భామ.. నేను క్షేమం అంటూ వీడియో విడుదల చేసిన ఆర్జే కాజల్..