RJ Kajal : పహల్గాంలో బిగ్ బాస్ తెలుగు భామ.. నేను క్షేమం అంటూ వీడియో విడుదల చేసిన ఆర్జే కాజల్..
తెలుగు బిగ్ బాస్ భామ, ఆర్జే కాజల్ ప్రస్తుతం పహల్గాంలోనే ఉందని తెలుస్తుంది.

Bigg Boss Fame RJ Kajal Went to Pahalgam Released a Video about Her Safety
RJ Kajal : జమ్మూకశ్మీర్ పహల్గాంలో మంగళవారం నాడు పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో దాదాపు 28మంది పర్యాటకులు మరణించారు. ఈ తీవ్ర ఘటనపై ఇప్పటికే అనేకమంది స్పందిస్తూ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అయితే తెలుగు బిగ్ బాస్ భామ, ఆర్జే కాజల్ ప్రస్తుతం పహల్గాంలోనే ఉందని తెలుస్తుంది. ఇటీవలే ఆర్జే కాజల్, ఆమె ఫ్రెండ్స్ కలిసి కాశ్మీర్ వెకేషన్ కి వెళ్లారని సమాచారం. దీంతో ఆమె ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కంగారుపడగా కాశ్మీర్ నుంచి ఓ వీడియో రిలీజ్ చేసింది ఆర్జే కాజల్. తన సోషల్ మీడియాలో క్షేమంగానే ఉన్నాను అంటూ ఓ వీడియో షేర్ చేసింది.
ఆర్జే కాజల్ ఈ వీడియోలో మాట్లాడుతూ.. ప్రస్తుతం మేము పహల్గాం నుంచి శ్రీనగర్ వెళ్తున్నాము. మేము క్షేమంగానే ఉన్నాము. రోడ్లు ప్రశాంతంగా ఉన్నాయి. అన్ని చోట్ల కట్టుదిట్టమైన భద్రత ఉంది. నా వెల్ విషర్స్ అందరూ నాకు కాల్స్, మెసేజ్ లు చేస్తున్నారు, నా కోసం ఆరా తీస్తున్నారు. అందరికి చాలా థ్యాంక్స్. నేను క్షేమంగానే ఉన్నాను. ఇక్కడి లోకల్ పోలీస్ లు సెక్యూరిటీ ఉన్నారు. కాశ్మీర్ ఎప్పటికి అందంగానే ఉంటుంది అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారగా జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆమె ఫాలోవర్స్.