Nani – Vijay Deverakonda : ఉగ్రదాడి జరిగిన పహల్గాం ప్రాంతంలోనే.. నాని, విజయ్ దేవరకొండ సినిమాల షూటింగ్.. వాళ్ళేమన్నారంటే..

హీరోలు నాని, విజయ్ దేవరకొండ పెట్టిన పోస్టులు వైరల్ గా మారాయి.

Nani – Vijay Deverakonda : ఉగ్రదాడి జరిగిన పహల్గాం ప్రాంతంలోనే.. నాని, విజయ్ దేవరకొండ సినిమాల షూటింగ్.. వాళ్ళేమన్నారంటే..

Nani and Vijay Deverakonda Movies Shootings Happened at Pahalgam

Updated On : April 23, 2025 / 3:31 PM IST

Nani – Vijay Deverakonda : జమ్మూకశ్మీర్ ప్రాంతం పహల్గాంలోని సుందరమైన బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై మంగళవారం నాడు ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో దాదాపు 28మంది పర్యాటకులు మరణించారు. ఈ తీవ్ర ఘటనపై ఇప్పటికే అనేకమంది సినీ ప్ర‌ముఖులు స్పందిస్తూ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఈ క్రమంలో హీరోలు నాని, విజయ్ దేవరకొండ పెట్టిన పోస్టులు వైరల్ గా మారాయి.

Also Read : Pahalgam Terror Attack: పర్యాటకుల ప్రాణాలు కాపాడేందుకు.. ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన హార్స్ రైడర్..

నాని తన ట్వీట్ లో.. మూడు నెలల క్రితం మేము అక్కడే ఉన్నాము. దాదాపు 20 రోజుల పాటు 200 మందికి పైగా అక్కడ షూటింగ్ చేశాము. ఆ ప్రదేశం, అక్కడి ప్రజలు, వారి మంచితనం పహల్గాం ఒక కలలా ఉంది.ఈ ఘటనతో హృదయం విరిగిపోయి మాటలు లేకుండా పోయింది. ఎందుకు? అంటూ రాసుకొచ్చారు.

ఇక విజయ్ దేవరకొండ తన ట్వీట్ లో.. నేను రెండేళ్ల క్రితం నా పుట్టినరోజుని పహల్గాంలోనే సెలబ్రేట్ చేసుకున్నాను. ఓ సినిమా షూటింగ్ లో భాగంగానే అక్కడికి వెళ్ళాను. అక్కడి లోకల్ కశ్మీరీ ప్రజలు, స్నేహితుల మధ్య నా పుట్టిన రోజు చేసుకున్నాను. వాళ్ళు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. నిన్న జరిగింది చాల బాధాకరమైన విషయం. సైనిక దుస్తుల్లో ఉగ్రవాదులు వచ్చి కాల్పులు జరపడం సిగ్గుచేటు. ఇలాంటి పిరికి వాళ్ళను త్వరలోనే అంతమొందిస్తారని అనుకుంటున్నాను. బాధిత కుటుంబాలకు మేము అండగా నిలుస్తాము. కాశ్మీర్ కి అండగా నిలుస్తాము. భారతదేశం ఉగ్రవాదానికి ఎప్పటికి తల వంచదు అని పోస్ట్ చేసారు.

Also Read : Pahalgam Terrorist Attack: పహల్గాం ఉగ్రదాడి వెనుక ప్రధాన సూత్రదారి సైఫుల్లా ఖలీద్.. పాకిస్తాన్‌ నుంచి కార్యకలాపాలు..!

దీంతో నాని హిట్ 3 సినిమా, విజయ్ దేవరకొండ ఖుషి సినిమాల షూటింగ్స్ అక్కడే పహల్గాంలోనే జరిగాయని తెలుస్తుంది.