Pahalgam Terrorist Attack: పహల్గాం ఉగ్రదాడి వెనుక ప్రధాన సూత్రదారి సైఫుల్లా ఖలీద్.. పాకిస్తాన్‌ నుంచి కార్యకలాపాలు..!

పహల్గాంలోని సుందరమైన బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రదాడి వెనుక ప్రధాన సూత్రదారి లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ అలియాస్ ఖలీద్ అని..

Pahalgam Terrorist Attack: పహల్గాం ఉగ్రదాడి వెనుక ప్రధాన సూత్రదారి సైఫుల్లా ఖలీద్.. పాకిస్తాన్‌ నుంచి కార్యకలాపాలు..!

Saifullah Khalid

Updated On : April 23, 2025 / 2:43 PM IST

Pahalgam Terrorist Attack: జమ్మూకశ్మీర్ ప్రాంతం పహల్గాంలోని సుందరమైన బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై మంగళవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో ఉగ్రవాదులు దాడికి తెబడిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 28మంది పర్యాటకులు మరణించారు. ఉగ్రవాదుల్లో కొందరు సైనికదుస్తుల్లో రాగా.. మరికొందరు సాధారణ దుస్తుల్లో బైసరన్ ప్రాంతంలోకి వచ్చారు. ఆ తరువాత టూరిస్టుల్లోని చిన్నారులు, మహిళలను వదిలిపెట్టి వారి కళ్లముందే పురుషులను కాల్చి చంపేశారు.

Also Read: Kashmir Terror Attack: భర్తను కాల్చేయడంతో నన్నూ చంపేయండంటూ ఉగ్రవాదులను వేడుకున్న భార్య.. అప్పుడు టెర్రరిస్టులు మోదీ పేరు ప్రస్తావిస్తూ ఏం చెప్పారంటే..

ఉగ్రదాడి సమాచారంతో వెంటనే సైన్యం ఆపరేషన్ చేపట్టింది. ఉగ్రవాదులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. తాజాగా.. ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు టెర్రరిస్టుల ఊహాచిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబుతాలాగా గుర్తించారు. మూసా, యూనిస్, ఆఫీఫ్ అనే కోడ్ నేమ్ లు కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే, పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సీనియర్ కమాండర్, అలియాస్ ఖలీద్ అనికూడా పిలువబడే సైఫుల్లా కసూరి ఈ ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారిగా నిఘా సంస్థలు గుర్తించాయి.

Also Read: Pahalgam Terrorist Attack: పహల్గాం ఉగ్రదాడి ఘటన.. ముగ్గురు ఉగ్రవాదుల ఊహ ఊచిత్రాలు విడుదల..

సైఫుల్లా ఖలీద్ పాకిస్థాన్ లోని గుజ్రన్ వాలా నగరం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. పాక్ ఐఎస్ఐ, ఆర్మీ ఉన్నతాధికారులతో సైఫుల్లాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో ఉన్న మరో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఈ దాడిలో ప్రధాన వ్యక్తులుగా ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.