Kashmir Terror Attack: భర్తను కాల్చేయడంతో నన్నూ చంపేయండంటూ ఉగ్రవాదులను వేడుకున్న భార్య.. అప్పుడు టెర్రరిస్టులు మోదీ పేరు ప్రస్తావిస్తూ ఏం చెప్పారంటే..

సైనిక దుస్తుల్లో వచ్చి పర్యాటకులను చుట్టుముట్టిన ఉగ్రవాదులు వారిపై కనికరం లేకుండా కాల్పులు జరిపారు. పురుషులను టార్గెట్ చేసుకొని వారిని కాల్చి చంపేశారు.

Kashmir Terror Attack: భర్తను కాల్చేయడంతో నన్నూ చంపేయండంటూ ఉగ్రవాదులను వేడుకున్న భార్య.. అప్పుడు టెర్రరిస్టులు మోదీ పేరు ప్రస్తావిస్తూ ఏం చెప్పారంటే..

Kashmir Terror Attack

Updated On : April 23, 2025 / 2:47 PM IST

Kashmir Terror Attack: కశ్మీర్ లో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చి కనికరం లేకుండా పర్యాటకులను చుట్టుముట్టి కాల్పులు జరిపారు. పురుషులు టార్గెట్ గా కాల్పులు జరిపారు. కొందరు ఉగ్రవాదులు వారి మతం పేరు అడిగి.. హిందువు అని నిర్ధారించుకున్న తరువాత తలపై తుపాకీతో కాల్చి చంపేశారు. పహల్గాం పట్టణానికి ఆరు కిలో మీటర్ల దూరంలో ఉండే బైసరన్ లోయలో ఉగ్రదాడి జరిగింది. ఈ ప్రాంతం మినీ స్విట్జర్లాండ్ గా పేర్కొందింది. బైసరన్ ప్రాంతానికి కాలినడక లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది.

Also Read: Kashmir Terror Attack: సైనిక దుస్తుల్లో వచ్చి కనికరం లేకుండా కాల్పులు.. మతం పేరు అడిగి తలపై తుపాకీ పెట్టి కాల్చేశారు.. కన్నీళ్లు పెట్టిస్తున్న మృతుల కుటుంబ సభ్యుల..

ఉగ్రవాదుల కాల్పుల్లో 28మంది పర్యాటకులు మరణించారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులుకూడా ఉన్నారు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న నిఘా విభాగం అధికారి మనీశ్ రంజన్, కర్ణాటకకు చెందిన వ్యాపారి మంజునాథ్ సైతం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్ గఢ్, ఒడిశా వాసులు ఉన్నారు. అయితే, ఈ ఉగ్రదాడి తమ పనేనని ‘ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌)’ సంస్థ ప్రకటించింది. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా నుంచి టీఆర్‌ఎఫ్‌ ఉద్భవించింది. జమ్మూకశ్మీరులో ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తర్వాత ఇది పుట్టుకొచ్చింది.

ఏపీ పదో తరగతి ఫలితాలు | Check Ap 10th Class Results 2025

సైనిక దుస్తుల్లో వచ్చి పర్యాటకులను చుట్టుముట్టిన ఉగ్రవాదులు వారిపై కనికరం లేకుండా కాల్పులు జరిపారు. పురుషులను టార్గెట్ చేసుకొని వారిని కాల్చి చంపేశారు. ఉగ్రవాదులు రావడాన్ని గమనించిన కొందరు భయంతో పరుగులు తీసి స్థానికంగా ఉన్న గుడారాల్లో తలదాచుకున్నారు. వారిని వెతికిమరీ ఉగ్రదావాదులు కాల్చిచంపేశారు. ఈ క్రమంలో పూణెకు చెందిన వ్యాపారవేత్త సంతోశ్ జగ్దలే (54) ప్రాణాలు కోల్పోయాడు. ఉగ్రవాదులు రావడాన్ని గమనించి సంతోశ్ జగ్దలే తన కుటుంబ సభ్యులతో కలిసి టెంటులో దాక్కున్నాడు. ఉగ్రవాదులు వారిని గుర్తించి సంతోశ్ జగ్దలే ను బయటకు రావాలని పిలిచారు. ఇస్లామిక్ ధర్మోక్తిని చదవమని అన్నారు. అందుకు సంతోశ్ ఒప్పుకోకపోవటంతో అతనిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.

 

మరోవైపు.. కర్ణాటకలోని షిమోగకు చెందిన మంజునాథ్, పల్లవి, తమ కుమారుడు అభిజయ్ తో కలిసి కశ్మీరు పర్యటనలో భాగంగా పహల్గాం సందర్శనకు వెళ్లారు. ఉగ్రవాదులు వారిని చుట్టుముట్టారు.. ఆ తరువాత మంజునాథ్ ను తుపాకీతో కాల్చి చంపేశారు. ఈ దారుణ ఘటన గురించి వివరిస్తూ మృతుడు భార్య పల్లవి కన్నీరుమున్నీరైంది. ‘‘నా కళ్ల ముందే నా భర్తను కాల్చారు.. ఆయన అక్కడికక్కడే మరణించాడు. నా భర్తను చంపారుగా నన్ను కూడాచంపేయండి అంటూ ఉగ్రవాదులను వేడుకున్నా.. వాళ్లు బదులిస్తూ.. మేము నిన్ను చంపం.. ఇక్కడి నుంచి వెళ్లిపో.. పోయి ఇక్కడ జరిగింది మీ ప్రధాని మోదీకి చెప్పు.. అని ఉగ్రవాదుల్లో ఒకరు బదులిచ్చారు’’ అంటూ పల్లవి కన్నీరుమున్నీరైంది.