Raj Kasireddy : ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన రాజ్ కేసిరెడ్డి.. నిర్మాతగా సినిమాలు కూడా.. ఏమేం సినిమాలో తెలుసా?
కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నిర్మాతగా కూడా సినిమాలు తీశారు.

AP Liquor Scam Raj Kasireddy done Films in Tollywood as Producer
Raj Kasireddy : ఇటీవల ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. లిక్కర్ స్కామ్ కేసులో కేసిరెడ్డి ఏ1గా ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 12 గంటల పాటు కేసిరెడ్డిని విచారించిన అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్‌తో కలిసి పనిచేసిన కేసిరెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఐటీ సలహాదారుగా వ్యవహరించారు.
అయితే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నిర్మాతగా కూడా సినిమాలు తీశారు. మొదట రెడ్ సినిమాస్ అనే బ్యానర్ స్థాపించి సుమంత్ హీరోగా మళ్ళీ మొదలైంది అనే సినిమా నిర్మించారు. ఈ సినిమా డైరెక్ట్ జీ5 ఓటీటీలో 2022 లో రిలీజయి పర్వాలేదనిపించింది.
ఆ తర్వాత ఈడీ ఎంటర్టైన్మెంట్ అనే మరో బ్యానర్ స్థాపించి నిఖిల్ తో స్పై అనే సినిమాని భారీగా నిర్మించారు. కానీ సినిమా రిలీజ్ డేట్ విషయంలో నిఖిల్ కి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి విబేధాలు రావడంతో ప్రమోషన్స్ సింపుల్ గా చేసి 2023లో రిలీజ్ చేయగా ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఈ స్పై సినిమాకు కథ కేసిరెడ్డి ఇవ్వడం గమనార్హం. ఆ తర్వాత టాలీవుడ్ లో మరికొంతమందికి అడ్వాన్సులు కూడా ఇచ్చారని సమాచారం. అలాగే ఓ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి బయోపిక్ కూడా తీయడానికి ప్రయత్నించినట్టు టాలీవుడ్ టాక్.