Indhra Ram : RX 100 సినిమా నేను చేయాలి.. డైరెక్టర్ నాతో ట్రావెల్ చేసాడు.. కానీ..
RX 100 సినిమా కూడా వేరే నటుడు చేయాల్సింది కార్తికేయ చేసాడట.

Actor Indhra Ram Supposed to do Kartikeya RX 100 Movie
Indhra Ram : సినిమా పరిశ్రమలో ఒకరు చేయాల్సిన సినిమా ఇంకొకరు చేయడం, ఒకరు చేయాల్సిన కథ ఇంకొకరి దగ్గరకు వెళ్లడం జరుగుతూనే ఉంటుంది. స్టార్ హీరోలకు సైతం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే RX 100 సినిమా కూడా వేరే నటుడు చేయాల్సింది కార్తికేయ చేసాడట.
నటుడు ఇంద్ర రామ్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన సినిమా చౌర్య పాఠం. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మాణంలో నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా తెరకెక్కిన చౌర్య పాఠం సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంద్ర రామ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపాడు.
గతంలో మీరేమైనా సినిమాలు చేసారా అని అడగ్గా ఇంద్ర రామ్ మాట్లాడుతూ.. ఆర్జీవీ గారి దగ్గరికి సినిమా ఛాన్స్ కోసం వెళ్తే వంగవీటి సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. డైరెక్టర్ అజయ్ భూపతితో చాలా రోజులు ట్రావెల్ చేశాను. RX 100 సినిమాలో నేనే చేయాలి. ఆ సినిమా కోసం అజయ్ భూపతితో ట్రావెల్ చేసాం. కానీ చివరి నిమిషాల్లో నిర్మాత వల్ల అది కార్తికేయ చేతికి వెళ్ళింది. కార్తికేయ కూడా బాగానే చేసాడు. అజయ్ భూపతి కార్తికేయతో చేయాల్సి వస్తుంది అని చెప్పడంతో పర్లేదు ఓకే అన్నాను అని తెలిపాడు. ఇప్పుడు హీరోగా ఈ సినిమాతో వస్తున్నాను. భవిష్యత్తులో హీరోగానే కాదు కీలక పాత్రలు వచ్చినా నటిస్తాను అని తెలిపాడు.
కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన RX100 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే.
Also Read : RJ Kajal : పహల్గాంలో బిగ్ బాస్ తెలుగు భామ.. నేను క్షేమం అంటూ వీడియో విడుదల చేసిన ఆర్జే కాజల్..