Advertisements : యాడ్స్ చేయాలంటే భయపడుతున్న సెలబ్రిటీలు.. యాడ్స్ కాస్తా కేసులు, వివాదాలుగా మారుతుండటంతో..
సినీ ఇండ్రిస్టీలో సెలబ్రిటీలు యాడ్స్ లో కూడా నటిస్తూ తమ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటుంటారు.

Tollywood Celebrities Afraid for Doing Advertisements
Advertisements : యాడ్స్ అంటేనే ఇప్పుడు సినీనటులు భయపడిపోతున్నారా? యాడ్స్ పేరుతో బ్రాండ్లకు ప్రమోషన్స్ ఇవ్వాలంటేనే యాక్టర్స్ జంకుతున్నారా? కోట్లు ఇస్తామంటున్నా కూడా యాడ్స్ చేసేందుకు హీరోలు, హీరోయిన్లు ఒప్పుకోవడంలేదా? వామ్మో మాకొద్దీ యాడ్స్ గోల అంటూ ప్రమోషన్స్ ను తగ్గించుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు కొందరు నటులు.
సినీ ఇండ్రిస్టీలో సెలబ్రిటీలు యాడ్స్ లో కూడా నటిస్తూ తమ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటుంటారు. చాలా తక్కువ టైమ్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ సంపాదించేది యాడ్స్ లోనే. ఇలా బ్రాండ్ అంబాసిడర్ గా టాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ కూడా చేస్తున్నారు. అయితే అవి లీగల్ గా వున్నాయా? లేదా చీట్ చేసేవా? ఆ యాడ్స్ తో ఏవైనా వివాదాలు వస్తాయా అనేది తెలుసుకోకుండా ఆ బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అవుతున్నారు.
ఇటీవల ప్రిన్స్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా సాయి సూర్య డెవలపర్స్ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటంతో ప్రస్తుతం ఈడీ నోటిసులు అందుకున్నాడు. దీనిలో హవాలా ద్వారా డబ్బులు తీసుకున్నాడని ఈడీ ప్రధాన ఆరోపణ. సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు ద్వారా చాలా మంది నష్టపోయారని వారి గురించి మహేష్ ఆలోచించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోసపూరిత సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ ఉండడం వల్లే సామాన్య జనాలు నమ్మి మోసపోయారని పలువురు విమర్శలు చేస్తున్నారు. దీంతో మహేష్ లీగల్ గా ఎలా ముందుకు వెళ్తారో అని చర్చ జరుగుతుంది.
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ శ్రీలీలపై కూడా కేసులు పెట్టాలన్న డిమాండ్స్ వస్తున్నాయట. కొన్ని కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని అల్లు అర్జున్ మభ్యపెట్టారని ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆరోపిస్తోంది. అల్లు అర్జున్ పై వెంటనే కేసు నమోదు చేయాలంటూ తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు కూడా చేశారట.
Also Read : Indhra Ram : RX 100 సినిమా నేను చేయాలి.. డైరెక్టర్ నాతో ట్రావెల్ చేసాడు.. కానీ..
ఇక పాన్ మషాలా యాడ్స్ చేసే నటీనటులపై రెగ్యులర్ గా విమర్శలు వస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం యాంకర్ సుమ కూడా ఓ యాడ్ చేయగా అది కాస్తా వివాదంలో నిలిచింది. అలా అప్పుడప్పుడు పలువురు సినీ సెలబ్రిటీలు చేసే యాడ్స్ వివాదాల్లో నిలుస్తూ, పోలీస్ కేసుల వరకు వెళ్తున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఇంకెంతమందిపై ఆరోపణలు వస్తాయో అని భయపడుతున్నారట. అందుకే నటి సమంత ఇటీవల ఒక్క ఏడాదిలోనే దాదాపు 15 బ్రాండ్స్ ప్రమోషన్స్ ను వదులుకుందట. తనకొచ్చే యాడ్ ప్రమోషన్స్ విషయంలో సమంత చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. సమంత కోవలోకే మిగిలిన నటీనటులు వెళ్లి ఇకపై యాడ్స్ చేస్తే అన్ని రకాలుగా తెలుసుకొని, పలువురి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే యాడ్స్ కి ఓకే చెప్పాలనే ఆలోచనలో టాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నారు. కొంతమంది అయితే ఈ తలనొప్పులు మనకెందుకు అని భయపడుతున్నారట.