Prabhas : ప్రభాస్, హను రాఘవపూడి సినిమా కథ ఏంటో తెలుసా..? ఆల్రెడీ మూడు సాంగ్స్..!

ప్రభాస్ తో చేయబోయే సినిమా గురించి దర్శకుడు హను రాఘవపూడి అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా కథ..

Hanu Raghavapudi comments about Prabhas Movie story backdrop

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీ షూటింగ్ పూర్తి చేశారు. ఇక నెక్స్ట్ లైనప్ లో ఉన్న సినిమాలను పట్టాలు ఎక్కించబోతున్నారు. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం రాజాసాబ్, సలార్ 2, స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలు ఉన్నాయి. రాజాసాబ్ షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కొంతభాగం చిత్రీకరణ జరుపుకుంది. సలార్ 2, స్పిరిట్ ఈ ఏడాది చివరిలో మొదలు కానున్నాయి. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్నాయి.

ఇక హను రాఘవపూడి సినిమా ఎప్పుడు మొదలవుతుంది..? ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తుంది..? అసలు ఈ సినిమాకి సంబంధించిన పనులు స్టార్ట్ అయ్యాయా, లేదా..? అనే విషయాలు పై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ లేదు. తాజాగా ఈ విషయాలు పై హను రాఘవపూడి కొంత సమాచారం ఇచ్చారు. ఈ మూవీ తన గత సినిమాలు మాదిరి లవ్ స్టోరీ కాకుండా పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో ఉండబోతుందట.

Also read : Vettaiyan : అక్టోబర్‌లో ఎటాక్‌కి సిద్దమవుతున్న రజినీకాంత్.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లో ఎవరికి పోటీ..!

ప్రీ ఇండిపెండెన్స్ టైం లైన్‌తో రజాకార్ నేపథ్యంలో ఈ మూవీని రూపొందించబోతున్నారట. యుద్ధం బ్యాక్‌డ్రాప్ తో సినిమా కథ ఉండబోతుందట. ఇక ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారని, ఆల్రెడీ మూడు సాంగ్స్ ని కూడా రెడీ చేసేశారని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇక ఈ కామెంట్స్ తో ఈ మూవీ మరిన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఈ సినిమాని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకు వెళ్తారో చూడాలి.

కాగా హను రాఘవపూడి చివరిగా ‘సీతారామం’ వంటి లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. అంతకముందు కృష్ణగాడి వీరప్రేమగాధ, అందాల రాక్షసి, లై, పడి పడి లేచే మనసు సినిమాలు తెరకెక్కించారు. మరి ఇన్నాళ్లు ప్రేమ కథలతో ఆకట్టుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు ప్రభాస్ తో పీరియాడిక్ యాక్షన్ మూవీ తెరకెక్కించి ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు