హ్యాపీ బర్త్‌డే బోయపాటి శ్రీను

ప్రస్తుతం బాలయ్యతో ముచ్చటగా మూడవ సినిమా చెయ్యనున్నాడు బోయపాటి.. ఈ సినిమా త్వరలో స్టార్ట్ కానుంది.

  • Publish Date - April 25, 2019 / 05:42 AM IST

ప్రస్తుతం బాలయ్యతో ముచ్చటగా మూడవ సినిమా చెయ్యనున్నాడు బోయపాటి.. ఈ సినిమా త్వరలో స్టార్ట్ కానుంది.

ఊరమాస్ డైరెక్టర్, మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్, తెరనిండా రక్తంపారించినా, ఫ్యామిలీ ఎమోషన్స్‌కి పెద్దపీట వేసినా, ఈ రెండింటిమధ్య ప్రేమని జోడించినా అది బోయపాటి శ్రీనుకే చెల్లింది. కయర్షియల్ ఫార్మాట్‌లో, మాస్ జనాలను మెప్పించేలా సినిమాలు తీస్తున్నమాస్ డైరెక్టర్ బోయపాటి పుట్టినరోజు ఈ రోజు.. (ఏప్రిల్ 25)..
రవితేజ నటించిన భద్ర సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన బోయపాటి, ఫస్ట్ మూవీతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత విక్టరీ వెంకటేష్‌తో చేసిన తులసి.. మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. నటసింహ నందమూరి బాలకృష్ణతో చేసిన సింహా, బోయపాటిని టాప్ డైరెక్టర్ల లిస్టులో చేర్చడమే కాక, వరస ఫ్లాప్స్‌లో ఉన్న బాలయ్యని తిరిగి ఫామ్‌లోకి తీసుకొచ్చింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో, దమ్ము సినిమా చేసాక, రెండోసారి బాలయ్యతో లెజెండ్ చేసాడు.. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడమే కాక, బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌కి గట్టిపునాదులు వేసింది. స్టైలిష్ స్టార్‌తో సరైనోడు, బెల్లంకొండ శ్రీనివాస్‌తో జయ జానకి నాయక సినిమాలతో హిట్స్ అందుకున్న శ్రీను, రామ్ చరణ్‌తో చేసిన వినయ విధేయ రామ విషయంలో తడబడ్డాడు. ఆ సినిమా మిగిల్చిన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తన తర్వాతి సినిమాని అత్యంత పకడ్బందీగా తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం బాలయ్యతో ముచ్చటగా మూడవ సినిమా చెయ్యనున్నాడు బోయపాటి.. ఈ సినిమా త్వరలో స్టార్ట్ కానుంది. తెలుగు ప్రేక్షకులను మెప్పించే మరిన్ని మంచి సినిమాలు తియ్యాలని ఆకాంక్షిస్తూ.. హ్యాపీ బర్త్‌డే బోయపాటి శ్రీను..

వాచ్, లెజెండ్ సీన్..