Pawan Kalyan : చిరుకి చిన్న తమ్ముడి విషెస్.. అన్నయ్య గురించి పవన్ ఏమన్నారో తెలుసా?
ఆగస్టు 22 మెగా అభిమానులందరికి పండగ రోజు. ఎందుకంటే ఆరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. మంగళవారం చిరంజీవి 68 పడిలో అడుగుపెడుతున్నారు.
- Thota Vamshi Kumar
- Published On : August 21, 2023 / 08:27 PM IST
Pawan Kalyan Wishes to chiru
Pawan Kalyan Wishes to chiru : ఆగస్టు 22 మెగా అభిమానులందరికి పండగ రోజు. ఎందుకంటే ఆరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. మంగళవారం చిరంజీవి 68 పడిలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన తమ్ముడు, జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషెస్ తెలియజేశారు. చిరంజీవికి తమ్ముడిగా పుట్టించినందుకు భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేశారు. ఓ సన్నని వాగు ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఓ నదిలా మారినట్లు చిరు పయనం సాగినట్లు చెప్పుకొచ్చారు. చిరంజీవి సంకల్ప, పట్టుదల, శ్రమ, నీతి నిజాయతీ సేవా భావం ఎందరికో ఆదర్శమన్నారు. సంపూర్ణ ఆయుష్షుతో చిరు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాతలు.. సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో..
“అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తమ్ముడుగా పుట్టి మిమ్మల్ని అన్నయ్యా అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతుడికి ముందుగా కృతజ్ఞతలు తెలుతున్నాను. ఒక సన్నని వాగు అలా అలా ప్రవహిస్తూ మహా నదిగా మారినట్లు మీ పయనం నాకు గోచరిస్తుంటుంది. మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాక లక్షలాది మందికి స్పూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతి నిజాయతీ, సేవా భావం నావంటి ఎందరికో ఆదర్శం. కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభిమానయ కౌసల్యంతో సినీ రంగాన అప్రతిహతంగా మీరు సాధిస్తున్న విజయాలు అజరామరమైనవి. ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో మీరు మరిన్ని విజయాలు చవి చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్నయ్య.” అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
Bigg Boss 7 : బిగ్‍బాస్ 7 డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచే షురూ.. గెట్ రెడీ
అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు – JanaSena Chief Shri @PawanKalyan@KChiruTweets#HBDMegastarChiranjeevi pic.twitter.com/ERu1BHiifr
— JanaSena Party (@JanaSenaParty) August 21, 2023
