డాషింగ్ డైరెక్టర్ బర్త్‌డే.. చరణ్, మహేష్ విషెస్ వైరల్..

  • Publish Date - September 28, 2020 / 07:28 PM IST

Happy Birthday Puri Jagannadh: ఈ జెనరేషన్ టాలీవుడ్‌ దర్శకుల్లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ది సెపరేట్ స్టైల్. కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, హీరో క్యారెక్టర్ డిజైనింగ్.. ఇలా ప్రతి విషయంలోనూ ఆయనది ప్రత్యేకమైన శైలి.. సినిమాల మేకింగ్‌ విషయంలో పూరి చాలా ఫాస్ట్‌..

ఆయన సమకాలీన దర్శకుల్లో ఏ ఒక్కరు కూడా పాతిక సినిమాలు కూడా చేయలేక పోయారు, భవిష్యత్తులో చేస్తారో లేదో కూడా తెలియదు. కాని ఇప్పటికే ఆయన 37 సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. సెప్టెంబర్ 28 డాషింగ్ డైరెక్టర్ పూరి పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియచేస్తున్నారు.


సూపర్‌స్టార్ మహేష్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌ అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో క్రేజ్. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే ‘పోకిరి’, ‘బిజినెస్‌మేన్’ వంటి సూపర్‌హిట్ సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన ‘జనగణమణ’ సినిమా ఆగిపోయింది. దీంతో వీరి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. పూరి బర్త్‌డే సందర్భంగా మహేష్ విషెస్ తెలియచేశారు.

‘నా అభిమాన డైరెక్టర్లలో ఒకరైన పూరీ జగన్నాథ్‌ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ సంతోషంగా, విజయోత్సాహంతో ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు.
అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పూరికి శుభాకాంక్షలు తెలియచేశారు.


పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’(వర్కింగ్ టైటిల్) పాన్ ఇండియా మూవీకి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే తనయుడు ఆకాష్ పూరి హీరోగా ‘రొమాంటిక్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు.