హ్యాపీ బర్త్‌డే one&only మెగాస్టార్..
- sekhar
- Updated on- August 22, 2020 / 01:56 PM IST
Happy Birthday Megastar Chiranjeevi: శనివారం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22). ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ సినీ ప్రముఖులు చిరుకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. మోహన్ బాబు, వెంకటేష్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ, రామ్, నారా రోహిత్, కార్తికేయ సహా పలువురు స్టార్స్, నిర్మాతలు, దర్శకులు ఇతర సెలబ్రిటీలు చిరంజీవికి ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు అభినందనలు తెలియజేశారు.
‘చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్’-మోహన్ బాబు
‘సినీ పరిశ్రమలో నా ప్రియ మిత్రుడు చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. హ్యపీ బర్త్‌డే చిరంజీవి’ -వెంకటేష్
‘చిరంజీవిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరొక జనరేషన్‌కు స్ఫూర్తిగా నిలిచారు. అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. మీకు ఆయరారోగ్యాలు కలగాలి’-మహేష్
‘మెగాస్టార్ చింరజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను సార్’-ఎన్టీఆర్
‘మా వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో సెలబ్రేట్ చేసుకోవాలి. మీపై ఉండే గౌరవం, ప్రేమ, కృతజ్ఞతలతో నా హృదయం నిండి ఉంటుంది. చాలా విషయాల్లో మీరు నాకు ఆచార్యులు’-అల్లు అర్జున్
‘మీరు నాకే కాదు.. ఎంతోమందికి ఇన్స్పిరేషన్.. చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు-రవితేజ
‘మా మెగాస్టార్ చిరంజీవి గారికి మెగా బర్త్‌డే శుభాకాంక్షలు. ఇలాగే ఇన్స్పైర్ చేస్తూ ఉండండి సార్’ రామ్..
వీరితోపాటు మెగాకోడలు ఉపాసన కొణిదెల, రానా దగ్గుబాటి, శ్రీకాంత్, అజయ్ భూపతి, అనిల్ రావిపూడి, పూరి జగన్నాధ్, హరీష్ శంకర్, మారుతి తదితరులు చిరుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
