×
Ad

Chay Akkineni : హ్యపీ బర్త్‌డే నాగ చైతన్య..

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య పుట్టినరోజు స్పెషల్ స్టోరీ..

  • Published On : November 22, 2021 / 08:18 PM IST

Happy Birthday Naga Chaitanya

Chay Akkineni: నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా.. ‘కింగ్’ నాగార్జున వారసుడిగా అక్కినేని వంశం నుంచి మూడోతరం నటుడిగా ‘జోష్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య. నవంబర్ 23 చైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా తండ్రితో కలిసి నటిస్తున్న ‘బంగార్రాజు’ నుండి చై ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేశారు. అలాగే ‘Thank You’ మూవీ ఫస్ట్ లుక్‌తో అక్కినేని అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు.

Naga Chaitanya : ‘వాసివాడి తస్సాదియ్యా.. వచ్చాడయ్యా ‘బంగార్రాజు’..

2009లో ‘జోష్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చై.. రెండో సినిమా ‘ఏమాయ చేశావే’ తో యూత్ ఆడియన్స్‌కి దగ్గరై, ‘100%లవ్’తో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ‘దడ, బెజవాడ, ఆటోనగర్ సూర్య, తడాఖా’ వంటి సినిమాల్లో తనలోని మాస్ యాంగిల్ చూపించి అలరించాడు.

 

‘సాహసం శ్వాసగా సాగిపో, యుద్ధం శరణం, ఒక లైలా కోసం, దోచెయ్, రారండోయ్ వేడుకచూద్దాం, శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి’ వంటి సినిమాలతో అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు ఫ్యామిలీ ఇమేజ్ తెచ్చుకున్నాడు. తాత, తండ్రి, తమ్ముడితో కలిసి నటించిన ‘మనం’, మేనమామ విక్టరీ వెంకటేష్, నాన్న నాగార్జున అతిథి పాత్రల్లో కనిపించి అలరించిన ‘ప్రేమమ్’, ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘మజిలీ’ చిత్రాలు చైతు కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతాయి.

 

‘తడాఖా’ తర్వాత వెంకటేష్‌తో కలిసి మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీమామ’తో మెప్పించాడు. అలాగే సుధీర్ బాబు ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’, సుశాంత్ ‘ఆటాడుకుందాం…రా…’, ‘ఓ..బేబి’.. సినిమాల్లో గెస్ట్ అప్పీరియెన్స్ ఇచ్చి అలరించాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే అద్భుతమైన ప్రేమకథా చిత్రంతో ఫ్యాన్స్, యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. పాండమిక్ తర్వాత భారీస్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి, హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిందీ సినిమా.

‘తాత గారు, నాన్న గారి ఆశీస్సులు, అక్కినేని అభిమానుల అండదండలతో సినిమా సినిమాకీ వైవిధ్యం చూపిస్తూ సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న మా నవ యువ సామ్రాట్ నాగ చైతన్య బాబుకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ #HBDYuvasamratNagaChaitanya అనే హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు నాగ చైతన్య అభిమానులు.