TFIలో 11 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘యువ సామ్రాట్’ అక్కినేని నాగ చైతన్య

  • Published By: sekhar ,Published On : September 4, 2020 / 11:14 PM IST
TFIలో 11 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘యువ సామ్రాట్’ అక్కినేని నాగ చైతన్య

#11YearsForChayInTFI: నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మనువడిగా.. ‘కింగ్’ నాగార్జున వారసుడిగా అక్కినేని వంశం నుంచి మూడోతరం నటుడిగా ‘జోష్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య. 2009 సెప్టెంబర్ 5న ఈ సినిమా విడుదలైంది. 2020 సెప్టెంబర్ 5 నాటికి చైతన్య హీరోగా పరిచయమై 11 సంవత్సరాలు పూర్తవుతున్నాయి..

JOSH



రెండో సినిమా ‘ఏమాయ చేశావో’తో యూత్‌కి దగ్గరై, ‘100%లవ్’తో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ‘దడ, బెజవాడ, ఆటోనగర్ సూర్య, తడాఖా’ వంటి సినిమాల్లో తనలోని మాస్ యాంగిల్ చూపించాడు.

yemaya chesave



‘సాహసం శ్వాసగా సాగిపో, యుద్ధం శరణం, ఒక లైలా కోసం, దోచెయ్, రారండోయ్ వేడుకచూద్దాం, శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి’ వంటి సినిమాలతో అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు.

MANAM



తాత, తండ్రి, తమ్ముడితో కలిసి నటించిన ‘మనం’, మేనమామ విక్టరీ వెంకటేష్, నాన్న నాగార్జున అతిథి పాత్రల్లో కనిపించి అలరించిన ‘ప్రేమమ్’, పెళ్లి తర్వాత భార్య సమంతతో కలిసి నటించిన ‘మజిలీ’ చిత్రాలు చైతు కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతాయి.

Premam



‘తడాఖా’ తర్వాత వెంకటేష్‌తో కలిసి మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీమామ’తో మెప్పించాడు. అలాగే సుధీర్ బాబు ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’, సుశాంత్ ‘ఆటాడుకుందాం…రా…’, ‘ఓ..బేబి’.. సినిమాల్లో గెస్ట్ అప్పీరియెన్స్ ఇచ్చి అలరించాడు.

Venky Mama



ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే అద్భుతమైన ప్రేమకథా చిత్రంతో పాటు ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్‌తో ‘థ్యాంక్యూ’ సినిమా చేస్తున్నాడు చైతన్య.

Majili



‘‘తాత గారు, నాన్న గారి ఆశీస్సులు, అక్కినేని అభిమానుల అండదండలతో సినిమా సినిమాకీ వైవిధ్యం చూపిస్తూ సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని, నటుడిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నమా “నవ యువ సామ్రాట్” నాగ చైతన్య బాబుకి హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అంటూ #11YearsForChayInTFI అనే హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు నాగ చైతన్య అభిమానులు. ఈ సందర్భంగా ఆర్య ప్రసాద్ డిజైన్ చేసిన చైతు పిక్స్ ఆకట్టుకోవడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Love Story