హ్యాపీ బర్త్‌డే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా..

  • Publish Date - July 18, 2020 / 06:15 PM IST

ఒకప్పటి బాలీవుడ్ బ్యూటీ, ఇప్పటి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జూలై 18న తన 38వ పుట్టినరోజు జరుపుకుంటుంది. హిందీ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న టైంలోనే హాలీవుడ్ సింగర్ కమ్ యాక్టర్ నిక్ జోనాస్‌ను పెళ్లాడి అమెరికాను అత్తారిల్లు చేసేసుకుంది పీసీ..

క్వాంటికో సిరీస్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది ప్రియాంక. ఒకరకంగా చెప్పాలంటే బాలీవుడ్ వైపు కన్నెత్తి చూడలేదంటే నమ్మండి. నిక్‌తో కలిసి వాళ్ల పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ పనులతో నిక్ ఫ్యామిలీ మెంబర్స్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది.

పుట్టినరోజు సందర్భంగా ప్రియాంక, నిక్ కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న కొన్ని పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలన్నీ కూడా ప్రియాంక తన ఇన్‌స్టాలో షేర్ చేసినవే. అలాగే పలువురు సినీ ప్రముఖులు పలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రియాంకకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.