Hari Hara Veera Mallu OTT Release Date: హరిహర వీరమల్లు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..

థియేట్రికల్ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కొంత భాగాన్ని మేకర్స్ కట్ చేశారు. డిలీట్ చేసిన క్లైమాక్స్, కొన్ని సన్నివేశాలు ఓటీటీ వెర్షన్‌లో ఉంటాయా? లేదా? అనేది చూడాలి.

Hari Hara Veera Mallu OTT Release Date

Hari Hara Veera Mallu OTT Release Date: హరిహర వీరమల్లు డిజిటల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. ఆ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.

పవర్ స్టార్‌ పవన్ కల్యాణ్ నటించిన ఈ సినిమా ఆగస్టు 20 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అందుబాటులోకి వస్తుంది.

ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం ఆడియోలతో పాటు ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు. అయితే హిందీ, కన్నడ వెర్షన్లపై సమాచారం లేదు.

Also Read: మన ఇస్రో అదరహో.. అత్యంత శక్తిమంతమైన 40 అంతస్తుల మెగా రాకెట్‌.. ఇక 75,000 కిలోల పేలోడ్‌ను తీసుకెళ్లి..

హరి హర వీర మల్లు సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. హరిహర వీరమల్లు సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనా కంటెంట్ అంచనాలను అందుకోలేదు.

ముఖ్యంగా సెకండ్‌ హాఫ్ స్క్రీన్‌ప్లే, వీఎఫ్ఎక్స్‌ బాగోలేవని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

థియేట్రికల్ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కొంత భాగాన్ని మేకర్స్ కట్ చేశారు. డిలీట్ చేసిన క్లైమాక్స్, కొన్ని సన్నివేశాలు ఓటీటీ వెర్షన్‌లో ఉంటాయా? లేదా? అనేది చూడాలి.

మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏఎం రత్నం నిర్మించిన ఈ భారీ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, సచిన్ ఖేడేకర్, రఘుబాబు, సుబ్బరాజు, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.