Harish Shankar-Raviteja : మిరపకాయ్ కాంబినేషన్ మళ్ళీ రెడీ.. సర్ప్రైజ్ ఇచ్చిన హరీష్ శంకర్.. ఈసారి పీరియాడికల్ డ్రామా..
ఓ నెటిజన్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో సినిమా తీయొచ్చు కదా అని రవితేజని అడిగాడు. దీంతో రవితేజ హరీష్ శంకర్ ని ట్యాగ్ చేస్తూ ఏదో అడుగుతున్నారు చూడు అని ట్వీట్ చేశాడు.
- Saketh U
- Published on- April 5, 2023 / 07:55 AM IST
Harish Shankar announced movie with Raviteja on periodical story
Harish Shankar-Raviteja : మాస్ మహారాజ(Mass Maharaja) రవితేజ(Raviteja) ప్రస్తుతం రావణాసుర(Ravanasura) సినిమాతో రాబోతున్నాడు. అయిదుగురు హీరోయిన్స్, సుశాంత్(Sushanth) ముఖ్య పాత్ర, రవితేజ నెగిటివ్ షేడ్స్ లో.. ఇలా ఇన్ని స్పెషల్స్ తో ఉన్న రావణాసుర సినిమా సుధీరవర్మ(Sudheer Varma) దర్శకత్వంలో ఏప్రిల్ 7న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ ట్విట్టర్(Twitter) లో అభిమానులతో ముచ్చటించి వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాడు.
ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో సినిమా తీయొచ్చు కదా అని రవితేజని అడిగాడు. దీంతో రవితేజ హరీష్ శంకర్ ని ట్యాగ్ చేస్తూ ఏదో అడుగుతున్నారు చూడు అని ట్వీట్ చేశాడు. హరీష్ శంకర్ ఈ ట్వీట్ కి రిప్లై ఇస్తూ.. అన్నయ్యతో సినిమా చేయడానికి నేనెప్పుడూ రెడీనే. ప్రస్తుతం ఓ పీరియాడికల్ డ్రామా స్టోరీపై వర్క్ చేస్తున్నాను కూడా. త్వరలో మా కాంబినేషన్ రిపీట్ చేసి హిస్టరీ అవుతుంది. థాంక్యూ అన్నయ్య అంటూ రవితేజని ట్యాగ్ చేశాడు.
దీంతో హరీష్ శంకర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. హరీష్ శంకర్ డైరెక్టర్ గా మొదటి సినిమా రవితేజతోనే. రవితేజతో షాక్ అనే సినిమా తీయగా ఆ సినిమా బానే ఉన్నా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. వెంటనే రవితేజ హరీష్ కి ఇంకో ఛాన్స్ ఇవ్వగా మిరపకాయ్ సినిమాతో ఈ కాంబో వచ్చింది. మిరపకాయ్ సినిమా భారీ విజయం సాధించింది. ఆ సినిమాతోనే హరీష్ డైరెక్టర్ గా నిలబడ్డాడు. హరీష్ ఇప్పటికే అనేకసార్లు చెప్పాడు రవితేజ వల్లే తాను డైరెక్టర్ అయ్యాను అని. ఇప్పుడు మరో సారి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ప్రకటించడంతో మాస్ మహారాజ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తీయడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమా అయిన తర్వాత రవితేజతో సినిమా ఉండొచ్చని సమాచారం. మరోసారి మిరపకాయ్ కాంబినేషన్ ఏ రేంజ్ లో వస్తుందో చూడాలి.
