Harish shankar: హిట్ కోసం కుర్ర హీరోతో మూవీ.. హరీష్ శంకర్ పక్కా ప్లాన్

ఉస్తాద్ తరువాత కుర్ర హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్న హరీష్ శంకర్(Harish shankar).

harish shankar next movie with nithin

  • ఉస్తాద్ తరువాత కన్ఫ్యూజన్ లో హరీష్
  • బాలకృష్ణతో మూవీ క్యాన్సిల్
  • నితిన్ ను ఒకే చేసిన మాస్ డైరెక్టర్

Harish shankar: టాలీవుడ్‌లో మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు హరీష్ శంకర్. మిరపకాయ్, గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గడ్డలకొండ గణేష్ లాంటి వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ దర్శకుడు ఈ మధ్య వరుస ప్లాప్స్ లో రేస్ లో వెనుకపడిపోయాడు. ఇటీవల ఆయన చేసిన మిస్టర్ బచ్చన్, ఉస్తాద్ భగత్ సింగ్ రెండు సినిమాలు కూడా ప్లాప్ లిస్టులోకి చేరిపోయింది.

Anudeep Arrest: పవన్, నిహారికపై అనుచిత వ్యాఖ్యలు.. స్టాండ్-అప్ కమెడియన్ అనుదీప్‌ అరెస్ట్

దాంతో, ప్రస్తుతం హరీష్ శంకర్‌తో పనిచేయడానికి అగ్ర హీరోలు సైతం వెనకడుగు వేస్తున్నారు. గతంలో బాలకృష్ణతో సినిమా చేయాలని భావించినా, ఉస్తాద్ ఫలితం చూశాక ఆయన ఆసక్తి చూపలేదని సమాచారం. మరోవైపు ఆయనకు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాణ సంస్థలు కూడా ఇబ్బందుల్లో ఉండటంతో హరీష్(Harish shankar) భవిష్యత్తు సందిగ్ధంలో పడింది. అయితే, తాజా సమాచారం ప్రకారం యంగ్ హీరో నితిన్‌తో ఆయన ఒక ప్రాజెక్ట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ప్రముఖ నాగవంశీ నిర్మాణంలో నితిన్‌కు ఒక ఆసక్తికరమైన కథను వినిపించగా, అది నితిన్‌కు నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి, హరీష్ శంకర్ తన మేకింగ్ స్టైల్ మార్చుకొని, రీమేక్ ఆలోచనల నుండి బయటపడితేనే మళ్లీ పూర్వ వైభవాన్ని దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కాబట్టి, నితిన్ తో సినిమా ఆయనకు మంచి కంబ్యాక్ ఇస్తుందా అనేది చూడాలి.