Harish Shankar : ఒరేయ్.. ఎక్కువ అరుస్తున్నావ్ నిన్ను ట్విట్టర్ లో బ్లాక్ చేస్తా.. హరీష్ శంకర్
మిస్టర్ బచ్చన్ ప్రీరిలీజ్ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడారు.
- Thota Vamshi Kumar
- Published On : August 13, 2024 / 07:33 AM IST
Harish Shankar speech in Mr Bachchan Pre Release event
Mr Bachchan Pre Release event : మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే కథనాయిక. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సోమవారం రాత్రి కర్నూలులో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది.
ఈ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడారు. తల్లి ఒకేసారి జన్మనిస్తుందని, కానీ తనకు దర్శకుడిగా జన్మనీ, పునర్జన్మనీ ఇచ్చింది రవితేజ అని అన్నారు. ఇంకేది అయినా ఇవ్వాలని అనుకున్నా ఇచ్చేయ్ అన్నయ్యా అంటూ హరీష్ శంకర్ అనడంతో అక్కడ నవ్వులు విరిసాయి. ఈ వేదిక పై నిలబడడానికి కారణం ఆయనే. చాలా సంవత్సరాల తరువాత ఆయనతో మూవీ కోసం సెట్‌లోకి వెళ్లినటప్పుడు ఎక్కడ లేని ప్రశాంతత వచ్చిందన్నారు.
Samantha : సమంత ఇక తెలుగు సినిమాల్లో కన్పించదా?
నిర్మాత టి.జి విశ్వప్రసాద్ సినిమాపై వంద రెట్ల తపనతో పనిచేస్తుంటారని అన్నారు. ఆయన సహకారంతోనే మూవీని ఇంత తొందరగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఇక మిస్టర్ బచ్చన్ విడుదల రోజునే డబుల్ ఇస్మార్ట్ మూవీ కూడా విడుదల అవుతోందని, ఈ రెండు సినిమాలను కూడా చూసి విజయవంతం చేయాలని దర్శకుడు హరీష్ శంకర్ ప్రేక్షకులను కోరారు.
ఆయన మాట్లాడుతుండగా.. ఓ వ్యక్తి బాగా అరుస్తుండడంతో అతడిని ట్విట్టర్ బ్లాక్ చేస్తానని, అతడి ఐడీ కూడా తనకు తెలుసునని హరీష్ శంకర్ అన్నారు. ముందు చెప్పేది వినాలని అతడికి సూచించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Venu Swamy : నాగచైతన్య- శోభితల జాతకం.. వేణుస్వామికి షాక్.. కలుద్దామన్న మంచు విష్ణు..!
