Harish Shankar : ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయి వచ్చి తనకు ప్రపోజ్ చేస్తే.. హరీష్ శంకర్ ఏం చెప్పాడో తెలుసా?
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హరీష్ చిన్నప్పటి ఓ ఆసక్తికర విషయం తెలిపాడు. (Harish Shankar)
- Saketh U
- Published On : March 17, 2026 / 08:29 PM IST
Harish Shankar
Harish Shankar : డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 19న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు హరీష్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హరీష్ చిన్నప్పటి ఓ ఆసక్తికర విషయం తెలిపాడు.
Also Read : Sridevi : వివాదంలో శ్రీదేవి ఆస్తి.. కోర్టుకెళ్లిన బోనీకపూర్, జాన్వీ కపూర్..
హరీష్ శంకర్ మాట్లాడుతూ.. చిన్నప్పట్నుంచీ ఏదో ఒకటి రాసేవాడిని. నేను బాగా రాస్తానని నా ఫ్రెండ్స్ నాతో లవ్ లెటర్లు రాయించుకొని చివర్లో వాళ్ళ పేరు రాయించి తీసుకెళ్ళి అమ్మాయిలకు ఇచ్చేవాళ్ళు. ఒకసారి ఒక ఫ్రెండ్ కి లెటర్ రాసి మర్చిపోయి చివర్లో ఫర్ ఎవర్ అని నా పేరు రాసేశా. అది చూసుకోకుండా వాడు ఒక అమ్మాయికి ఇచ్చేసాడు.
ఆ అమ్మాయి నేను పంపించాను ఏమో అనుకోని ఆ లెటర్ కి నాకు పాజిటివ్ గా స్పందించడం, నన్ను చూసి నవ్వడం చేసేది. సిగ్గు పడేది. తర్వాత ఆ అమ్మాయి వచ్చి హరీష్ నువ్వు నాకు ఎప్పట్నుంచో ఇష్టం అని చెప్పడంతో.. మీకు ఇష్టమే కానీ నాకు కష్టం. నా క్లోజ్ ఫ్రెండ్ నిన్ను ఇష్టపడ్డాడు. మర్చిపోయి నా పేరు రాసాను సారీ అని చెప్పి తప్పించుకున్నాను. ఇది నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు జరిగింది అని తెలిపాడు.
