Band Melam : రోషన్ శ్రీదేవి ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్ వచ్చేసింది.. బావ మరదళ్ల ప్రేమకథ..
రోషన్ శ్రీదేవి 'బ్యాండ్ మేళం' ట్రైలర్ వచ్చేసింది.. (Band Melam)
- Saketh U
- Updated on- March 21, 2026 / 09:30 AM IST
Band Melam
Band Melam : కోర్ట్ సినిమా ఫేమ్ రోషన్, శ్రీదేవి జంటగా తెరకెక్కుతున్న సినిమా బ్యాండ్ మేళం. కోన వెంకట్ సమర్పణలో కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై కావ్య, శ్రావ్య నిర్మాణంలో సతీష్ జవ్వాజి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు.
ఈ ట్రైలర్ చూస్తుంటే బావ మరదళ్ల ప్రేమకథని, నలుగురు బ్యాండ్ మేళం ఫ్రెండ్స్ తో ఫుల్ లెంగ్త్ కామెడీగా, చివర్లో ఎమోషన్ తో ఉండబోతుందని తెలుస్తుంది. బ్యాండ్ మేళం సినిమా మార్చ్ 26న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. మీరు కూడా బ్యాండ్ మేళం ట్రైలర్ చూసేయండి..
