×
Ad

Harsha Vardhan : పవన్ కళ్యాణ్ గారితో వారం రోజులు పనిచేసాను.. అప్పటి సంగతులు చెప్పిన హర్షవర్ధన్..

పవన్ కళ్యాణ్ తో వర్క్ చేసినప్పటి సంగతులు పంచుకున్నారు.(Harsha Vardhan)

  • Published On : February 23, 2026 / 08:38 PM IST

Harsha Vardhan

Harsha Vardhan : నటుడిగా, రచయితగా ఫేమ్ తెచ్చుకున్న హర్షవర్ధన్ ఇటీవల సంక్రాంతికి చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసి మెప్పించారు. తాజాగా హర్షవర్ధన్ 10 టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర అంశాలు తెలిపారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో వర్క్ చేసినప్పటి సంగతులు పంచుకున్నారు.(Harsha Vardhan)

Also Read : Sivaji : అనసూయ నాకు పరిచయం కూడా లేదు.. తెలిసినవాళ్ళే నా మీద కంప్లైంట్ చేశారు.. శివాజీ కామెంట్స్..

హర్షవర్ధన్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ సినిమాలో ఒక్క సీన్ లో నటించాను అంతే. కానీ గుడుంబా శంకర సినిమాకు రైటింగ్ టీమ్ లో పనిచేసాను. అప్పుడు నేను సీరియల్స్ కి రాస్తున్నాను. అమృతం చేస్తున్నాను. నా వర్క్ నచ్చి నాగబాబు గారు తీసుకున్నారు. సినిమాలకు ట్రై చేయమని నాగబాబు చెప్పేవాళ్ళు. కానీ ఆయనే ప్రోత్సహించి ఛాన్స్ ఇచ్చారు మొదటిసారి.

ఏదైనా చిన్న సినిమాకు ఇస్తారేమో అనుకున్నా. ఒక రోజు పిలిచి కళ్యాణ్ బాబు సినిమాకు పనిచేయాలి అన్నారు. బెంగుళూరు ఫామ్ హౌస్ లో కళ్యాణ్ బాబు గారితో కూర్చొని వారం రోజుల పాటు స్క్రిప్ట్ వర్క్ చేసాము. ఆయనతో అలా వారం రోజులు మర్చిపోలేని ట్రావెల్ చేసాం. అప్పటి పరిచయం అంతే. చాన్నాళ్ల తర్వాత గబ్బర్ సింగ్ లో చిన్న పాత్రలో నటించినప్పుడు ఆయన గుర్తుపెట్టుకొని పిలిచి బాగున్నావా అంటూ మాట్లాడారు. ఇన్నేళ్లయినా గుర్తున్నానా ఆయనకు అని ఆశ్చర్యపోయానట్టు తెలిపారు.

Also Read : Harish Shankar : పొలిటికల్ కంటెంట్ లేదు.. పవన్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన హరీష్ శంకర్..