Has Lokesh Kanagaraj's next movie Khaidi 2 been cancelled?
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్.. తమిళ ఇండస్ట్రీ స్టార్ డైరెక్టర్. ఈ దర్శకుడి సినిమా ఒకటి వస్తుంది అంటే ఆ హైప్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. తీసింది కేవలం ఆరు సినిమాలు మాత్రమే కానీ, ఆయనకు వచ్చిన క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. అందుకే భాషతో సబందం (Lokesh Kanagaraj)లేకుండా స్టార్ హీరోలు ఆయనతో సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ, ఒకే ఒక్క ప్లాప్ ఆయన కెరీర్ నే డైలామాలో పడేసింది. ఆ సినిమా మరేదో కాదు కూలీ. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల అయ్యింది. భారీ హైప్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకోలేదు.
Peddi: పెద్ది సినిమా కోసం చరణ్ కష్టం.. జానీ మాస్టర్ పోస్ట్ వైరల్.. హ్యాపీగా ఫీలవుతున్న మెగా ఫ్యాన్స్
కనీసం తమిళంలో కూడా అనుకున్నంతగా ఆడలేదు ఈ సినిమా. దీంతో, దర్శకుడు లోకేష్ పై సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. కూలీ సినిమా కథ రజినీకాంత్ స్టామినాకి సరిపోయేలా లేదని, ఈ సినిమా ప్లాప్ అవడానికి ప్రధాన కారణం లోకేష్ అంటూ రజినీకాంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. అయితే, ఈ సినిమా విడుదలై రెండు నెలలు గడుస్తున్నా లోకేష్ పై ఆ ఇంపాక్ట్ మాత్రం పోవడం లేదు. ఎంతలా ఉందంటే, తాను చేయబోయే తరువాతి సినిమా గురించి ఎలాంటి క్లారిటీ రావడం లేదు.
కొంతకాలం లోకేష్ తన నెక్స్ట్ సినిమా రజినీకాంత్-కమల్ హాసన్ తో చేస్తారని న్యూస్ వినిపించాయి. కానీ, దానిపై మేకర్స్ నుంచి గానీ, లోకేష్ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక లోకేష్ చాలా కాలంగా చేయాలనుకుంటున్న సినిమా ఖైదీ 2. కార్తీతో ఈ సినిమా చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు లోకేష్. రజిని-కమల్ సినిమాపై క్లారిటీ రాకపోవడంతో లోకేష్ నెక్స్ట్ ఖైదీ 2సినిమా చేస్తాడని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ, ఖైదీ 2 సినిమా కూడా క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తోంది. కూలీ రిలీజ్ కి ముందు ఖైదీ 2 సినిమా ఒక బడ్జెట్ చెప్పాడట లోకేష్. కానీ, కూలీ రిలీజ్ తరువాత పరిస్థితులు మారాయని నిర్మాత బడ్జెట్ లో ,మార్పులు కోరాడట. మరి దానికి లోకేష్ అంగీకరించాడా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. మరి, ఇలాంటి పరిస్థితులలో లోకేష్ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో ప్రేక్షలకుల ముందుకు వస్తాడు అనేది చూడాలి.