HBD NTR: నీవు నాకు ఏమవుతావో ఒక్క పదంలో చెప్పలేను.. తారక్‌కు చరణ్ స్పెషల్ విషెష్!
జూనియర్ ఎన్టీఆర్ నేడు (మే 20) తన 39వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినీ ప్రముఖులతో పాటు తారక్ అభిమానులు కూడా అర్ధరాత్రి నుండే సోషల్ మీడియా లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
- Naresh Mannam
- Published On : May 20, 2022 / 12:14 PM IST
Hbd Ntr
HBD NTR: జూనియర్ ఎన్టీఆర్ నేడు (మే 20) తన 39వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినీ ప్రముఖులతో పాటు తారక్ అభిమానులు కూడా అర్ధరాత్రి నుండే సోషల్ మీడియా లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం తారక్ తో అనుబంధాన్ని వర్ణిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పుడు ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.
Jr NTR: రెండు రోజుల్లో తారక్ బర్త్ డే.. ఆతృతగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్!
ఇటీవలే రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో స్నేహితుల్లా నటించిన చరణ్, తారక్ బయట కూడా అదే బంధాన్ని కొనసాగిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కూడా తమ స్నేహబంధం ఇలానే కొనసాగుతుందని ఇటీవలే చరణ్, తారక్ స్పష్టం చేశారు. ఆ మాటకొస్తే ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందే ఎన్టీఆర్, చరణ్ మంచి స్నేహితులు. అంతకు ముందు వీరి స్నేహం పెద్దగా ప్రచారానికి తెలియకపోగా ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇది కాస్త హైలెట్ అయింది.
Jr NTR: డొనేట్ ఏ మీల్.. సేవలో తారక్ ఫ్యాన్స్ అరుదైన రికార్డ్!
కాగా, మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. అందుకు సంబంధించిన కొన్ని పిక్స్ కూడా వైరల్ గా మారాయి. ఇక, నేడు (మే 20) ఎన్టీఆర్ పుట్టినరోజు కారణంగా తారక్ కు రామ్ చరణ్ స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పారు. సోదరుడు, సహనటుడు, స్నేహితుడు.. మీరు నాకు ఏమవుతారో చెప్పేందుకు ఒక్క పదం సరిపోదు. మన బంధం ఇప్పటికీ, ఎప్పటికీ ఉండాలని ఆశిస్తున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు అని వీరిద్దరూ హత్తుకున్న ఓ ఫొటోను పంచుకుంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.
Brother, co-star, friend … I don’t think words can define who you are to me @tarak9999 !
I will always always cherish what we have 🤗
Happy Birthday ! pic.twitter.com/CPHDUEzf6m— Ram Charan (@AlwaysRamCharan) May 20, 2022
