He-man and the Masters of the Universe : ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ ట్రైలర్ వచ్చేసింది.. నిఖిల్ సిద్ధార్థ వాయిస్ తో..
మీరు కూడా హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ ట్రైలర్ చూసేయండి.. (He-man and the Masters of the Universe)
- Saketh U
- Published on- May 20, 2026 / 03:15 PM IST
He-man and the Masters of the Universe
He-man and the Masters of the Universe : హాలీవుడ్‌లో సూపర్ హిట్ ఫ్రాంచైజ్ అయినా ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ ఇప్పుడు ఇండియాలోకి రాబోతుంది. ఇప్పటికే ఇంగ్లీష్ ట్రైలర్ రిలీజ్ అవ్వగా తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసారు. తెలుగు వెర్షన్‌లో హీరో హీ-మ్యాన్ పాత్రకు మన హీరో నిఖిల్ సిద్ధార్థ తన వాయిస్ ఇవ్వడం గమనార్హం.
అలాగే విలన్ స్కెలెటర్ పాత్రకు ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ తన వాయిస్‌ను అందించగా, డంకన్ పాత్రకు సీనియర్ నటుడు రావు రమేష్ వాయిస్ ఇవ్వడం విశేషం. తన ప్రపంచం నుంచి భూమి మీదకు వచ్చిన హీరో మాలి తన ప్రపంచానికి వెళ్తాడా, అక్కడ తన వాళ్ళను రక్షించుకుంటాడా అనే ఆసక్తికర కథనంతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ‘ఎటెర్నియా’ ప్రపంచంలోని యాక్షన్, ఎమోషన్, ఫాంటసీ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.
Also Read : Ramani Kalyanam : ‘రమణి కళ్యాణం’ ట్రైలర్ చూశారా..? నడవలేని అబ్బాయి, చూపులేని అమ్మాయి ప్రేమకథ..
మీరు కూడా హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ ట్రైలర్ చూసేయండి..
అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ నిర్మాణంలో, ట్రావిస్ నైట్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా నికోలస్ గలిట్జైన్ ప్రిన్స్ ఆడమ్/హీ-మ్యాన్‌గా నటిస్తుండగా, కమిలా మెండెస్ టీలా పాత్రలో, జారెడ్ లెటో స్కెలెటర్ పాత్రలో, మ్యాన్-అట్-ఆర్మ్స్ పాత్రలో ఇడ్రిస్ ఎల్బా కనిపించనున్నారు. సోనీ పిక్చర్స్ ఈ సినిమాని అంతర్జాతీయంగా జూన్ 5వ తేదీన రిలీజ్ చేస్తుండగా ఇండియాలో ఇంగ్లీష్ తో పాటు హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో కూడా విడుదల కానుంది.
