Heart of Stone : బాలీవుడ్ నటీ అలియాభట్(Alia Bhatt) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో సీతగా నటించి ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేసింది. తాజాగా అమ్మడు హాలీవుడ్‌లోనూ అదరగొట్టేందుకు సిద్దం అయ్యింది. గాల్ గాడోట్, జామీ డోర్నాన్, సోఫీ ఒకొనెడో, మాథియాస్, జింగ్ లూసిలు కీలక పాత్రల్లో ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ (Heart of Stone ) అనే హాలీవుడ్ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి టామ్ హార్పర్ దర్శకుడు. ఈ సినిమాలో అలియా భట్ కూడా ఓ కీలక పాత్రలో నటించింది. తాజాగా ఈ చిత్ర తెలుగు ట్రైలర్ విడుదలైంది.
ఈ సినిమాలో అలియా విలన్‌గా కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతోంది. యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్‌లతో దుమ్ము లేపింది. ఈ సినిమాలో ఆమె పాత్ర పై అంచనాలను ట్రైలర్ పెంచేసింది. ఇక ఈ సినిమా అలియాకు చాలా స్పెషల్ అన్న సంగతి తెలిసిందే. హాలీవుడ్లో అలియాకు ఇదే మొదటి సినిమా కావడం ఒక కారణం అయితే.. ప్రెగ్నెన్సీతో ఉన్న సమయంలోనే అలియా ఈ సినిమా షూటింగ్లో పాల్గొని కంప్లీట్ ఇంకో కారణం.
Dil Raju : దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ ఈవెంట్‌కి గెస్ట్‌గా దిల్ రాజు..
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. దేశాన్ని ప్రమాదాల బారి నుంచి రక్షించుకునేందుకు చార్టర్ అనే ఒక టీమ్ రహస్యంగా పని చేస్తుంటుంది. ఈ టీమ్‌ను గాల్ గాడోట్ లీడ్ చేస్తుంటారు. ది హార్ట్ అని పిలిచే ఓ మాక్ గఫిక్ కోసం వీరు వెతుకుతూ ఉంటారు. దీని కోసమే మరో గ్యాంగ్ కూడా వెతుకుతూ ఉంటుంది. కియా ధావన్ అనే పాత్రలో అలియా కనిపించింది. చివరకు ఏం జరిగింది అన్నదే సినిమా స్టోరీ. యాక్షన్ సన్నివేశాలు అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. ఇక ఈ సినిమా ఆగస్టు 11న నెట్ ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
Sudheer Babu : మా నాన్న సూపర్ హీరో అంటున్న సుధీర్ బాబు.. కోటి రూపాయిల లాటరి టికెట్!