Sudheer Babu : మా నాన్న సూపర్ హీరో అంటున్న సుధీర్ బాబు.. కోటి రూపాయిల లాటరి టికెట్!
సుధీర్ బాబు తన కొత్త సినిమా నుంచి అప్డేట్ ఇచ్చాడు. ఫాదర్స్ డే నాడు 'మా నాన్న సూపర్ హీరో' అంటూ టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేసి..

Sudheer Babu new movie titled as Maa Nanna Super hero
Sudheer Babu : నైట్రో స్టార్ సుధీర్ బాబు మాస్ కట్ అవుట్ ఉన్నా గాని కథకి ప్రాధాన్యత ఇస్తూ వైవిధ్యం వైపు అడుగులు వేస్తుంటాడు. ఈ క్రమంలోనే పలు డిఫరెంట్ స్టోరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చి హిట్టులు అందుకున్నాడు. చివరిగా ఈ హీరో 2021 లో ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి కాన్సెప్ట్ మూవీతో హిట్ అందుకున్నాడు. ఆ తరువాత ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘హంట్’ వంటి సినిమాలతో ప్రయోగాలు చేసినప్పటికీ వర్క్ అవుట్ అవ్వలేదు. ఇప్పుడు మరో కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు.
Adipurush : ఆదిపురుష్ సెకండ్ డే కలెక్షన్స్ జోరు.. టాక్ ఎలా ఉన్నా 100 కోట్లకు ఏమాత్రం తగ్గడం లేదు..
‘మా నాన్న సూపర్ హీరో’ అనే టైటిల్ ని అనౌన్స్ చేస్తూ తన కొత్త సినిమా గురించి అప్డేట్ ఇచ్చాడు. ఇటీవల ‘లూసర్’ (Loser) అనే వెబ్ సిరీస్ తో మంచి విజయం అందుకున్న దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర.. ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. టైటిల్ పోస్టర్ బట్టి చూస్తుంటే ఈ మూవీ ఫాదర్ సెంటిమెంట్ తో రాబోతున్నట్లు తెలుస్తుంది. కేరళ బ్యాక్ డ్రాప్ లో సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక రిలీజ్ చేసిన పోస్టర్ లో కోటి రూపాయిలు లాటరి టికెట్ ఎవరో ఒకరు గెలుచుకున్నట్లు చూపించారు. పోస్టర్ చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంది.
Sitara : మరోసారి సారంగదరియా స్టెప్పులతో అదరగొట్టిన సితార.. మహేష్ కూతురా మజాకా..
క్యామ్ ఎంటర్‌టైనమెంట్స్ పతాకం పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. V సెల్యులాయిడ్స్ బ్యానర్ సహా నిర్మాతగా వ్యవహరిస్తోంది. జై క్రిష్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ వానాకాలంలో ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ మరియు ఇతర తారాగణం గురించి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మూవీతో పాటు సుధీర్ బాబు మామ మశ్చీంద్ర, హరోం హర, పుల్లెల గోపీచంద్ బయోపిక్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.
Presenting the title of #Sudheer17, #MaaNannaSuperhero ??
This monsoon, buy the ticket and take the ride with a HEARTWARMING ENTERTAINER ✨?
Happy Father’s day to all the SUPERHERO NANNA’s out there ?@isudheerbabu @abhilashkankara @vcelluloidsoffl @cam_entmnts @jaymkrish… pic.twitter.com/p2dWedhyAD
— UV Creations (@UV_Creations) June 18, 2023