Sitara : మరోసారి సారంగదరియా స్టెప్పులతో అదరగొట్టిన సితార.. మహేష్ కూతురా మజాకా..

ఇటీవల క్లాసికల్ డ్యాన్స్, డ్యాన్స్ నేర్చుకుంటుంది సితార. దీంతో పలు పాటలకు స్టెప్పులు వేస్తూ ఆ వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.

Sitara : మరోసారి సారంగదరియా స్టెప్పులతో అదరగొట్టిన సితార.. మహేష్ కూతురా మజాకా..

Mahesh Babu daughter sitara dance videos goes viral

Updated On : June 18, 2023 / 9:54 AM IST

Sitara Dance : మహేష్ బాబు(Mahesh Babu) కూతురిగా సితార ఘట్టమనేని అందరికి పరిచయమే. కానీ తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతిరోజు ప్రయత్నం చేస్తుంది సితార. గతంలోనే మహేష్ భవిష్యత్తులో సితార హీరోయిన్ అవుతుందని చెప్పాడు. సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్రెండ్ ఆద్యతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నడిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన ఫోటోలు, వీడియోలు, ఫ్యామిలీ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తుంది సితార.

ఇటీవల క్లాసికల్ డ్యాన్స్, డ్యాన్స్ నేర్చుకుంటుంది సితార. దీంతో పలు పాటలకు స్టెప్పులు వేస్తూ ఆ వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. గతంలో ఆల్రెడీ సర్కార్ వారి పాట సినిమాలో ఓ పాట కోసం స్టెప్పులు వేసింది. ఇక మహేష్ తో కలిసి ఓ యాడ్ లోను నటించింది. ఇటీవల అప్పుడప్పుడు సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోల్ని సోషల్ మీడియాలో పెట్టి సందడి చేస్తుంది సితార. తాజాగా లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి చేసిన సారంగదరియా సాంగ్ కి స్టెప్పులు వేసి రెండు వీడియోల్ని పోస్ట్ చేసింది సితార. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి.

Preetham Jukalker : చై చాలా మంచివాడు.. సమంతతో తన రిలేషన్ గురించి మొదటిసారి మాట్లాడిన ప్రీతమ్ జుకల్కర్..

సితార డ్యాన్స్ అదిరిపోయిందని, మహేష్ కూతురు అంటే ఆ మాత్రం ఉంటుందని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి సితార వైరల్ గా మారింది. సితార ఎప్పుడు సినిమాల్లో కనిపిస్తుందా అని మహేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

View this post on Instagram

A post shared by sitara ? (@sitaraghattamaneni)