Preetham Jukalker : చై చాలా మంచివాడు.. సమంతతో తన రిలేషన్ గురించి మొదటిసారి మాట్లాడిన ప్రీతమ్ జుకల్కర్..

సమంత ఇతని ఒళ్ళో కాళ్ళు పెట్టి పడుకున్న ఫోటో పోస్ట్ చేసి, డిలీట్ చేయడంతో, వీరిద్దరివి ప్రీతమ్ క్లోజ్ గా దిగిన ఫోటోలు షేర్ చేయడంతో పలువురు చై అభిమానులు, నెటిజన్లు ప్రీతమ్ ని విమర్శించారు, ఇతని వల్లే వాళ్ళు విడిపోయారని కామెంట్స్ చేశారు.

Preetham Jukalker : చై చాలా మంచివాడు.. సమంతతో తన రిలేషన్ గురించి మొదటిసారి మాట్లాడిన ప్రీతమ్ జుకల్కర్..

Preetam Jukalkar first time speak about relation with samantha and trolls on him regarding chai sam divorce

Updated On : June 18, 2023 / 9:31 AM IST

Samantha : చైతన్య(Chaitanya) సమంత విడాకులు తీసుకున్న సమయంలో బాగా వినపడింది పేరు ప్రీతమ్ జుకల్కర్(Preetam Jukalkar). ప్రీతమ్ ఒక ఫ్యాషన్ డిజైనర్(Fashion Designer), సెలబ్రిటీ స్టయిలిష్ట్. ముంబై నుంచి ఇక్కడికి వచ్చి టాలీవుడ్ సెలబ్రిటీలకు, ముఖ్యంగా హీరోయిన్స్ కి స్టైలిష్ గా వర్క్ చేస్తూ ఇక్కడే సెటిల్ అయిపోయాడు. తన కెరీర్ మొదట్లో సమంత ప్రీతమ్ జుకల్కర్ కి ఎక్కువ సపోర్ట్ ఉండటంతో సమంతకు చాలా వరకు ప్రీతమ్ స్టయిలిష్ట్ గా పనిచేశాడు. అయితే చై సామ్ విడిపోయినప్పుడు ఇతనివల్లే వాళ్ళు విడిపోయారని, వాళ్ళ విడాకులకు ఇతను కూడా ఒక కారణమని పలువురు వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో చై ఫ్యాన్స్ ఇతనిపై దారుణంగా విమర్శలు చేశారు.

ఇక సమంత ఇతని ఒళ్ళో కాళ్ళు పెట్టి పడుకున్న ఫోటో పోస్ట్ చేసి, డిలీట్ చేయడంతో, వీరిద్దరివి ప్రీతమ్ క్లోజ్ గా దిగిన ఫోటోలు షేర్ చేయడంతో పలువురు చై అభిమానులు, నెటిజన్లు ప్రీతమ్ ని విమర్శించారు, ఇతని వల్లే వాళ్ళు విడిపోయారని కామెంట్స్ చేశారు. ఇక ఇతను గే అని కూడా పలువురు వ్యాఖ్యానించారు. గతంలో దీనిపై డైరెక్ట్ గా ఎప్పుడూ మాట్లాడలేదు ప్రీతమ్. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రీతమ్ దీనిపై స్పందించాడు.

ప్రీతమ్ ఆ ఇష్యూపై మాట్లాడుతూ.. సమంత చాలా మంచి అమ్మాయి. నా కెరీర్ స్టార్టింగ్ లో ఇక్కడికి వచ్చినప్పుడు తనే సపోర్ట్ చేసింది. సమంత, నేను క్లోజ్ గా ఉన్న ఫోటో ఒకటి పెట్టి డిలీట్ చేసింది. దీంతో అంతా నన్ను ట్రోల్ చేశారు. మా రిలేషన్ గురించి తప్పుగా మాట్లాడారు. బ్రదర్, సిస్టర్ అనుకోవచ్చు లేదా ఫ్రెండ్స్ అనుకోవచ్చు. ఇక చై చాలా మంచివాడు. నాకు పరిచయం ఉంది. చాలా హంబుల్ గా ఉంటాడు. వీరు డైవర్స్ తీసుకున్నప్పుడు చాలా మంది నన్ను అన్నారు. నా గురించి చాలా తప్పుగా మాట్లాడారు. నా ప్లేస్ లో ఇంకొకరు ఉంటే సూసైడ్ చేసుకొని చనిపోయేవాళ్లు. సమంత ఇప్పటికి నాకు సపోర్ట్ గా నిలుస్తుంది అని వ్యాఖ్యానించాడు. దీంతో ప్రీతమ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Sudhakar : చెన్నైలో ఆస్తులన్నీ అమ్మేసాను.. దయచేసి నా ఆరోగ్యంపై పుకార్లు సృష్టించొద్దు.. నా కొడుకు త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ..

ఇక ఇండస్ట్రీలో ఫ్యాషన్ డిజైనర్స్, స్టయిలిష్ట్ ల గురించి ఎక్కువగా మాట్లాడరని, స్టేజిపై మా పేర్లు చెప్పరని అన్నాడు ప్రీతమ్. ఇండస్ట్రీలో హీరోలు కొత్తగా డిజైన్స్ చేస్తే ఒప్పుకోరు, హీరోయిన్స్ ఎంకరేజ్ చేస్తారు. అందుకే మేము ఎక్కువగా హీరోయిన్స్ కే పని చేస్తాము అని తెలిపాడు ప్రీతమ్. దీంతో ప్రీతమ్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ గా మారింది.