Sudhakar : చెన్నైలో ఆస్తులన్నీ అమ్మేసాను.. దయచేసి నా ఆరోగ్యంపై పుకార్లు సృష్టించొద్దు.. నా కొడుకు త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ..

తాజాగా చాలా రోజుల తర్వాత సుధాకర్ మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. తాజాగా ఓ ఛానల్ కి సుధాకర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Sudhakar : చెన్నైలో ఆస్తులన్నీ అమ్మేసాను.. దయచేసి నా ఆరోగ్యంపై పుకార్లు సృష్టించొద్దు.. నా కొడుకు త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ..

Comedian Sudhakar shares so many interesting facts in recent Interview

Updated On : June 18, 2023 / 8:06 AM IST

Comedian Sudhakar :  ఒకప్పుడు హీరోగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వందల సినిమాలు చేసి మెప్పించారు సుధాకర్. కమెడియన్ గా సూపర్ ఫామ్ చూశారు. ప్రస్తుతం వయోభారంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల సుధాకర్ మరణించారని వార్తలు రావడంతో నేను బాగానే ఉన్నాను అంటూ ఇలాంటి పుకార్లు పుట్టించొద్దు అంటూ వీడియోని రిలీజ్ చేశారు.

తాజాగా చాలా రోజుల తర్వాత సుధాకర్ మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. తాజాగా ఓ ఛానల్ కి సుధాకర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇప్పటికి తాను ఫోన్ చేస్తే చిరంజీవి, జగపతి బాబు, తనికెళ్ళ భరణి, JD చక్రవర్తి.. ఇలా పలువురు రెస్పాండ్ అవుతారని, అప్పుడప్పుడు వాళ్ళతో ఫోన్స్ చేసి మాట్లాడతానని తెలిపారు.

ఇక చెన్నైలో తనకు చాలా ఆస్తులు ఉన్నాయని, తమిళ్ లో సినిమాలు చేస్తున్న సమయంలో తెలుగులో కమెడియన్ గా బ్రేక్ రావడంతో ఇటు వచ్చి సెటిల్ అయ్యాను, ఆ తర్వాత చెన్నైలో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసాను అని తెలిపారు సుధాకర్. ఇక తన ఆరోగ్యం పై వచ్చిన వార్తలకు స్పందిస్తూ.. ఇలాంటివి గతంలో కూడా చాలా చూశాను, సెలబ్రిటీలపై ఇలాంటి పుకార్లు సహజమే. ప్రస్తుతానికి నా ఆరోగ్యం బాగుంది. దయచేసి ఇలాంటి పుకార్లు సృష్టించొద్దు. అని అన్నారు.

Manoj Muntashir : మేము తీసింది రామాయణం కాదు.. రామాయణం ఆధారంగా చేశాం అంతే.. మాట మార్చిన ఆదిపురుష్ రైటర్..

ఇక తన కొడుకు బెన్నీ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని, యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాడని, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఇంట్రడ్యూస్ అవుతాడని, అలా అయితేనే మంచి క్యారెక్టర్స్, ఎక్కువ సినిమాలు చేయొచ్చని తెలిపారు సుధాకర్.