×
Ad

Taapsee Pannu : తాప్సీ పై తీవ్ర విమర్శలు.. అక్కడ మాత్రం బికినీలు, రొమాంటిక్ సీన్స్.. టాలీవుడ్ పై విషం ఎందుకు..?

సౌత్ లో ఫేమ్ తెచ్చుకొని నార్త్ లో స్టార్స్ అయిన వాళ్ళు సౌత్ సినిమాలపై ఏదో ఒకరకంగా విమర్శలు చేసినవాళ్ళే.(Taapsee Pannu)

  • Published On : February 23, 2026 / 04:44 PM IST

Taapsee Pannu

Taapsee Pannu : మన టాలీవుడ్ లో నార్త్ నుంచి హీరోయిన్స్ ని తీసుకొస్తారు. వాళ్ళు ఇక్కడ ఫేమ్ తెచ్చుకొని బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతూ ఉంటారు. అక్కడివరకు పర్వాలేదు. కాని కొంతమంది హీరోయిన్స్ ఇక్కడ ఫేమ్ తెచ్చుకొని బాలీవుడ్ వెళ్ళాక టాలీవుడ్ పై విషం కక్కుతారు. పలువురు హీరోయిన్స్ ఇప్పటికే సౌత్ లో ఫేమ్ తెచ్చుకొని నార్త్ లో స్టార్స్ అయిన వాళ్ళు సౌత్ సినిమాలపై ఏదో ఒకరకంగా విమర్శలు చేసినవాళ్ళే.(Taapsee Pannu)

గతంలో ఆల్రెడీ తాప్సీ టాలీవుడ్ లో నాభిని చూపిస్తారని, తన మొదటి సినిమాలో నా నాభి మీద పండ్లు, పూలు, ఆఖరికి కొబ్బటికాయలు కూడా వేశారని వ్యంగ్యంగా మాట్లాడింది. తనకు హీరోయిన్ గా లైఫ్ ఇచ్చిన రాఘవేంద్రరావు మీద వ్యాఖ్యలు చేసింది. ఇదే వ్యాఖ్యలను మరోసారి చేస్తూనే సౌత్ సినిమాల్లో ప్యాడెడ్ బ్రాలు వేసుకోమంటారు, నాభి చూపిస్తారు అంటూ టాలీవుడ్, సౌత్ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Also Read : Vishal : విజయ్ కోసం 1500 మందితో ధర్నా చేస్తానంటున్న విశాల్.. ఎందుకో తెలుసా?

కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్స్ ని అందంగా చూపించడానికి ప్రయత్నిస్తారు దర్శకులు. కానీ అది హీరోయిన్ కి ముందే చెప్తారు. హీరోయిన్ కి నచ్చే ఓకే చెప్పి అగ్రిమెంట్ చేసుకొనే సినిమా చేస్తారు. సినిమా చేసిన తర్వాత ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్ అని తాప్సీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టాలీవుడ్ తో హీరోయిన్ గా మారి, సౌత్ లో ఫేమ్ తెచ్చుకొని ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్లి టాలీవుడ్ ని విమర్శిస్తావా అంటూ తాప్సీపై ఫైర్ అవుతున్నారు.

నీకు నచ్చకపోతే సినిమా చేయను అని చెప్పొచ్చు కదా. అప్పుడేమో సినిమాలు చేసి ఇప్పుడేమో ఇంటర్వ్యూలో కూర్చొని కామెంట్స్ చేస్తావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ లో అయితే తాప్సీ బికినీ సీన్స్, రొమాంటిక్ సీన్స్ కూడా చాలా సినిమాల్లో చేసింది. దీంతో బాలీవుడ్ లో మాత్రం ఇలాంటి సీన్స్ చేయలేదా అంటూ తాప్సీని ట్రోల్ చేస్తున్నారు. అవసరం ఉన్నప్పుడు టాలీవుడ్ లో సైలెంట్ గా సినిమాలు చేసి అవసరం తీరాక బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూర్చొని తాపీగా తాప్సీ టాలీవుడ్ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదంటూ విమర్శలు చేస్తున్నారు.

Also Read : Mega Brothers : అల్లు శిరీష్ పెళ్లి వేడుక.. మెగా బ్రదర్స్ కి స్పెషల్ పెళ్లి పిలుపు.. ఫోటోలు వైరల్

ఇక కొంతమంది అయితే తాప్సీ సినిమా రిలీజ్ సమయంలోనే ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ చేసి ప్రమోషన్స్ కోసం టాలీవుడ్ ని నెగిటివ్ చేస్తుందని కామెంట్స్ చేశారు. రీసెంట్ గా తాప్సీ నటించిన అస్సి అనే సినిమా రిలీజయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలోనే తాప్సీ ఈ కామెంట్స్ చేసింది. ఇక ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోగా ఓపెనింగ్స్ కూడా అంతగా రాలేదు.