Mega Brothers : అల్లు శిరీష్ పెళ్లి వేడుక.. మెగా బ్రదర్స్ కి స్పెషల్ పెళ్లి పిలుపు.. ఫోటోలు వైరల్
అల్లు శిరీష్ నయనికల పెళ్లి మార్చ్ 6న జరగనుంది.(Mega Brothers)
Mega Brothers
Mega Brothers : అల్లు వారింట పెళ్లి పనులు వేగవంతం అయ్యాయి. అల్లు శిరీష్ ఇటీవల నయనిక అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నయనిక – అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీ చేసుకోగా ఆ పార్టీ ఫోటోలు వైరల్ అయ్యాయి. అల్లు శిరీష్ నయనికల పెళ్లి మార్చ్ 6న జరగనుంది.(Mega Brothers)
ఇటీవల పసుపు కొట్టి పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఇక పెళ్లి పిలుపులు కూడా మొదలుపెట్టారు. అల్లు శిరీష్ పెళ్లి మొదటి పత్రికని మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖకు అల్లు అరవింద్, భార్య నిర్మల, అల్లు శిరీష్ కలిసి అందించినట్టు ఫోటో షేర్ చేసి శిరీష్ తెలిపాడు. తాజాగా మిగిలిన ఇద్దరు మెగా బ్రదర్స్ కి పెళ్లి పత్రికని అందించారు.

Also Read : AA22xA6: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.. AA22 టీజర్ వచ్చేస్తోంది.. RFC భారీ ఈవెంట్
నాగబాబు – పద్మజలకు, పవన్ కళ్యాణ్ – అన్నా లేజనోవాలకు అల్లు అరవింద్, భార్య నిర్మల, అల్లు శిరీష్ కలిసి పెళ్లి పత్రికని అందించి పెళ్ళికి ఆహ్వానించారు. పెళ్లి పత్రికతో పాటు స్పెషల్ గిఫ్ట్ ప్యాక్ ని కూడా అందించి పెళ్ళికి పిలిచారు. ఈ ఫోటోలని అల్లు శిరీష్ తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీంతో ఈ పెళ్లితో మరోసారి మెగా – అల్లు ఫ్యామిలీలు కలిసి కనిపించబోతున్నాయని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.


