Hebah Patel Dhoom Dhaam Teaser out
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మూవీ ‘ధూం ధాం’. సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. నవంబర్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టింది. ఈ చిత్ర టీజర్ ను దర్శకుడు మారుతి చేతుల విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ధూం ధాం చిత్ర టీజర్ బాగుందన్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయన్నారు. చిత్ర బృందానికి ఆల్‌ది బెస్ట్ చెప్పారు.
Blockbuster @DirectorMaruthi Garu launched the TEASER of #DhoomDhaam#DhoomDhaam Teaser Out Now!
In theatres November 8th#DhoomDhaamOnNov8
pic.twitter.com/S3JztgCor3— Suresh PRO (@SureshPRO_) October 22, 2024
ఓ మంచి లవ్‌స్టోరీతో పాటు తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్ బాండింగ్ ఈ చిత్రంలో చూపించనున్నట్లుగా టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. వెన్నెల కిశోర్ కామెడీ ట్రాక్ సూపర్‌గా ఉంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ విడుదల కానుంది.