×
Ad

Eesha OTT: ఓటీటీకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్.. చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం

హెబ్బా పటేల్ ఈషా(Eesha OTT) మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్.

Hebba Patel Eesha Movie OTT Streaming Update.

Eesha OTT: టాలీవుడ్ ఇండస్ట్రీలో రీసెంట్ గా విడుదలైన బెస్ట్ హార్ థ్రిల్లర్ మూవీ ఈషా. త్రిగుణ్, అఖిల్‌ రాజ్, హెబ్బా పటేల్‌, సిరి హన్మంత్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు శ్రీనివాస్ మన్నే తెరకెక్కించాడు. గత ఏడాది డిసెంబర్ 12న ఈ సినిమా విడుదల అయ్యింది. చాలా గ్యాప్ తరువాత తెలుగులో వచ్చిన హారర్, థ్రిల్లర్ కావడంతో ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకు.

Sunny Leone: స్టన్నింగ్ బ్యూటీ సన్నీ లియోన్.. గ్లామర్ షోకి సోషల్ మీడియా షేక్.. ఫొటోలు

థియేటర్స్ లో కూడా మంచి రెస్పాన్స్ రాబట్టింది ఈ మూవీ. కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయని కూడా మేకర్స్ చెప్పారు. కానీ, అదే రోజున మరో మూడు సినిమాలు కూడా విడుదల ఉండటంతో ఈ సినిమాకు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. కానీ, పాజిటీవ్ టాక్ నే తెచ్చుకుంది ఈ సినిమా. అయితే, ఈషా(Eesha OTT) సినిమా విడుదలై రెండు నెలలు గడుస్తున్నా ఓటీటీకి రాలేదు ఈ సినిమా.

అందుకే, ఈ సినిమా ఓటీటీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఈనేపథ్యంలోనే ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేసింది ఈషా మూవీ. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి మీకు హారర్ అండ్ థ్రిల్లర్ జానర్ సినిమాలు అంటే ఇష్టమా అయితే,వె వంటనే ఈ సినిమాను చూసేయండి.