సెప్టెంబర్ 28న పూరీ జగన్నాధ్ బర్త్‌డే సందర్భంగా.. 20 మంది డైరెక్టర్స్, కో-డైరెక్టర్స్‌కి ఆర్ధిక సహాయం అందించనున్నారు..
సెప్టెంబర్ 28న పూరీ జగన్నాధ్ బర్త్‌డే సందర్భంగా ‘ఇస్మార్ట్ శంకర్’.. మూవీని రీ-రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రా, తెలంగాణాలో సెలెక్టెడ్ థియేటర్స్‌లో ఈ శుక్రవారం (సెప్టెంబర్ 27) ‘ఇస్మార్ట్ శంకర్’.. విడదలవుతోంది. ఇదిలా ఉంటే పూరీ జగన్నాధ్ తన పుట్టినరోజుని పురస్కరించుకుని తన పార్ట్‌నర్ ఛార్మీతో కలిసి తెలుగు సినీ పరిశ్రమలోని డైరెక్టర్స్, కో-డైరెక్టర్స్ కొంతమందికి ఆర్ధిక సహాయం అందచెయ్యనున్నాడు.
ఈ మేరకు పూరీ కనెక్ట్స్ ద్వారా అఫీషియల్ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. పూరీ కూడా కష్టపడి పైకొచ్చిన వాడే కాబట్టి అతనికి కష్టం విలువ, సినిమా పరిశ్రమలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్లు పడే కష్టాలు తెలుసు కాబట్టి, ‘ఇస్మార్ట్ శంకర్’.. సక్సెస్ తాలూకు సంతోషాన్ని వారితో పంచుకోవాలని డిసైడ్ అయ్యాడు.
Read Also : వార్‌తో ‘మర్దానీ 2’ ట్రైలర్..
ఒకప్పుడు సినిమాలు చేసి ప్రస్తుతం పనిలేక ఖాళీగా ఉండి, తమ జీవితాలను సినిమాకి అంకితం చేసి కష్టపడి పనిచేసిన 20 మంది డైరెక్టర్స్, కో-డైరెక్టర్స్‌కి ఆర్ధిక సహాయం అందించనున్నారు. ‘ప్రేమతో అంగీకరించండి, ఇదేమీ పెద్ద సహాయం కాదు.. చిన్న చిరునవ్వు లాంటి పలకరింపు అంతే’.. అంటూ పూరీ వారిని రిక్వెస్ట్ చేశాడు. చాలా కాలం తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ విజయంతో పూరీ ట్రాక్‌లోకి వచ్చాడు.
Helping hand by our #boss @purijagan n #bosslady @Charmmeofficial .. all film lovers r invited .. #respect ?? #hbdpurijagan ?? pic.twitter.com/We5BFehThl
— Puri Connects (@PuriConnects) September 27, 2019