జనవరి 17న ఎంజీఆర్ జయంతి సందర్భంగా ‘తలైవి’ సినిమాలోని అరవింద్ స్వామి లుక్ రిలీజ్ చేశారు..
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ను ‘తలైవి’ పేరుతో తెలుగు నిర్మాత విష్ణు ఇందూరి రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ బాషల్లో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు.
లెజెండరీ తమిళనాడు దివంగత రాజకీయ నాయకుడు ఎం.జి.రామచంద్రన్(ఎంజీఆర్) పాత్రలో ప్రముఖ నటుడు అరవిందస్వామి నటిస్తున్నారు. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ నిర్మిస్తున్నారు. ఇటీవల కంగనా రనౌత్ లుక్ విడుదల చేయగా మంచి స్పందన లభించింది.
జనవరి 17న ఎంజీఆర్ జయంతి సందర్భంగా ‘తలైవి’ సినిమాలోని ఆయన లుక్ రిలీజ్ చేశారు. ఎంజీఆర్ గా అరవింద్ స్వామి మేకోవర్ చాలా బాగుంది. అచ్చు గుద్దినట్టు ఎంజీఆర్ లా మారిపోయారాయన. ఎంజీఆర్ పాత్రలోకి చాలా బాగా ఇన్వాల్వ్ అయి అరవింద్ స్వామి నటిస్తున్నారని మూవీ టీమ్ తెలిపారు. ఈ చిత్రానికి విశాల్ విట్టల్ సినిమాటోగ్రఫీ, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నారు.