తలైవి – అరవింద స్వామి ఎంజీఆర్ టీజర్

జనవరి 17న ఎంజీఆర్ జయంతి సందర్భంగా ‘తలైవి’ సినిమాలోని అరవింద స్వామి ఎంజీఆర్ టీజర్ రిలీజ్ చేశారు..

  • Publish Date - January 17, 2020 / 05:55 AM IST

జనవరి 17న ఎంజీఆర్ జయంతి సందర్భంగా ‘తలైవి’ సినిమాలోని అరవింద స్వామి ఎంజీఆర్ టీజర్ రిలీజ్ చేశారు..

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ ‘తలైవి’ తెలుగు, తమిళ్ మరియు హిందీ భాషల్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ నిర్మిస్తున్నారు. ఇటీవల కంగనా రనౌత్ లుక్ విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.

లెజెండరీ త‌మిళ‌నాడు దివంగ‌త రాజ‌కీయ నాయ‌కుడు, మక్కల్ తిలగం ఎం.జి.రామ‌చంద్ర‌న్(ఎంజీఆర్‌) పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అర‌వింద‌ స్వామి న‌టిస్తున్నారు. జనవరి 17న ఎంజీఆర్ జయంతి సందర్భంగా ‘తలైవి’ సినిమాలో అరవింద స్వామి లుక్ రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజాగా అరవింద స్వామి ఎంజీఆర్ టీజర్ రిలీజ్ చేశారు. ‘‘ఎంజీఆర్ ని దేవుడని పిలుస్తారు. 17-1-1917 లో పుట్టారు.. ఇప్పటికీ ప్రజల హృదయాల్లో జీవించే ఉన్నారు’’ అంటూ స్టార్ట్ అయిన టీజర్‌లో ఎంజీఆర్ గెటప్‌లో ఉన్న అరవింద స్వామి ఓ పాట పాడడాన్ని చూపించారు. అరవింద స్వామి హావభావాలు అచ్చు ఎంజీఆర్ లానే ఉన్నాయంటున్నారు తమిళ తంబీలు.