నయన్, శామ్ మధ్యలో మక్కల్ సెల్వన్ – మళ్లీ ప్రేయసినే నమ్ముకున్న ప్రియుడు

‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, సమంత, నయనతార ప్రధాన తారాగణంగా నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ సినిమా..

  • Publish Date - February 15, 2020 / 11:08 AM IST

‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, సమంత, నయనతార ప్రధాన తారాగణంగా నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ సినిమా..

విఘ్నేష్ శివన్.. ఈ కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ గురించి మన తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదేమో కానీ.. లేడి సూపర్ స్టార్ నయనతార ప్రియుడు అంటే మాత్రం వెంటనే గుర్తుపటపటేస్తారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించిన‘నానుమ్ రౌడీదాన్’ చిత్రాన్ని విఘ్నేష్ డైరెక్ట్ చేశాడు.

ఈ సినిమా షూటింగ్ అప్పుడే నయన్, విఘ్నేష్ ప్రేమలో పడ్డారు. నయనతార లేడి ఓరియంటెడ్ సినిమాలతో పాటు కథానాయికగానూ రజనీకాంత్, విజయ్, అజిత్ వంటి అగ్రహీరోలతో సినిమాలు చేసినా మనోడు మాత్రం నయన్ వెనకే తిరుగుతున్నాడు. సూర్యతో చేసిన ‘గ్యాంగ్’ సినిమా నయన్ రికమండేషన్‌తోనే విఘ్నేష్‌కి వచ్చింది. వాలెంటైన్స్ డే సందర్భంగా తన కొత్త సినిమాని ప్రకటించాడు నయన్ ప్రియుడు.

నయనతార, సమంత.. ఇద్దరూ టాప్ హీరోయిన్లే! అయితే.. వీరిద్దరు ఒక్క సినిమా కూడా కలిసి చేయలేదు కానీ ఇప్పుడు చేస్తున్నారు. ఒక్క కథతో వీరిద్దర్నీ ఒప్పించిన ఘనత విఘ్నేష్ శివన్‌దే. విజయ్‌ సేతుపతి హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కదవుక్కుళ్ల రెండు కాదల్‌’. తెలుగులో ‘తలుపు వెనుక రెండు ప్రేమకథలు’ అని అర్థం. ఇందులో నయనతార, సమంత నాయికలు. ప్రేమికుల రోజు కానుకగా శుక్రవారం ఈ చిత్రాన్ని ప్రకటించారు.

అదీ ‘తొలిసారి వెండితెరపై కనీవిని ఎరుగని ఘర్షణ. నయనతార వర్సెస్‌ సమంత’ అని! వర్సెస్‌ (విఎస్‌) అంటే విజయ్‌ సేతుపతి అనీ చెప్పారు. ఇదో ముక్కోణపు ప్రేమకథ. నారీ (నయనతార) నారీ (సమంత) నడుమ విజయ్‌ సేతుపతి ఏం చేస్తారో? ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీత దర్శకుడు.

అన్నట్టు… ‘నేనూ రౌడీనే’ తర్వాత విజయ్‌ సేతుపతి, విఘ్నేశ్‌ శివన్‌, నయనతార, అనిరుధ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది. ఈసారి వీళ్లకు సమంత జత కలిశారు. దర్శకుడు ప్రేయసి పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాడో? సమంత పాత్రకు ఇస్తాడో? చూడాలి.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో అధికారికంగా చిత్రాన్ని ప్రారంభించనున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు.

 

Read Here>>మెరుపు వేగం : ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలుకొట్టిన భారతీయుడు

ట్రెండింగ్ వార్తలు