ప్రేమకావాలి చిత్రం తో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు సాయి కుమార్ తనయుడు ఆది. ఆయనకు ఈ చిత్రం మంచి విజయాన్ని అందించింది. ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ కొట్టాడు.. కానీ ఆ తర్వాత ఆది చాలా సినిమాల్లో నటించినప్పటికీ సరైన హిట్ రాలేదు. రీసెంట్‌గా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ అనే చిత్రాన్ని పూర్తి చేసిన ఆది.. ప్రస్తుతం ‘జోడి’ అనే కొత్త సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడూ ఈ హీరో ఎలాగైనా సాలిడ్ హిట్టు కొట్టాలని సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఈ చిత్రం యొక్క ప్రీ లుక్ పోస్టర్ ఈ రోజు (ఏప్రిల్ 6, 2019)న విడుదలకాగా రేపు ఉదయం ఫస్ట్ లుక్ ను లాంచ్ చేయనున్నారు. విశ్వనాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జెర్సీ ఫేమ్ శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. సాయి వెంకటేష్ గుర్రం, పద్మజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.