Vijay Deverakonda : ఫ్యాన్ గర్ల్ మూమెంట్.. విజయ్ దేవరకొండని చూడగానే ఫుల్ ఎగ్జైట్ అయిన దిల్‌రాజు కోడలు.. వీడియో వైరల్..
ఆశిష్ - అద్విత వెడ్డింగ్ రిసెప్షన్ కి విజయ్ దేవరకొండ కూడా వచ్చాడు. దీంతో ఓ వీడియో వైరల్ గా మారింది.
- Saketh U
- Published on- February 24, 2024 / 10:13 AM IST
Hero Ashish Wife exited while seeing Vijay Deverakonda in their Wedding Reception Video goes Viral
Vijay Deverakonda : దిల్ రాజు(Dil Raju) సోదరుడు శిరీష్ కొడుకు, హీరో ఆశిష్(Ashish) వివాహం ఇటీవల ఫిబ్రవరి 14న అద్వితతో ఘనంగా జైపూర్ లోని ఓ ప్యాలెస్ లో జరిగింది. తాజాగా నిన్న ఫిబ్రవరి 23న హైదరాబాద్ లోని N కన్వెన్షన్ లో ఆశిష్ – అద్వితల వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ వెడ్డింగ్ రెసెప్షన్ కి సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, మీడియా, దిల్ రాజ్ సొంతూరి నుంచి ప్రజలు వచ్చి కొత్త జంటని ఆశీర్వదించారు.
అయితే ఆశిష్ – అద్విత వెడ్డింగ్ రిసెప్షన్ కి విజయ్ దేవరకొండ కూడా వచ్చాడు. దీంతో ఓ వీడియో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండని చూడగానే దిల్ రాజు కోడలు, పెళ్లికూతురు అద్విత చాలా ఎగ్జైట్ అయింది. పట్టలేని సంతోషంతో, తన ఫేవరేట్ హీరోని మొదటిసారి చూస్తున్న ఆనందంతో కనపడింది. వీడియోలో ఆశిష్, దిల్ రాజు కూతురు.. అద్వితని విజయ్ దేవరకొండకి పరిచయం చేయగా విజయ్ షేక్ హ్యాండ్ ఇచ్చి విషెష్ తెలిపారు. అనంతరం విజయ్ తో ఫ్యామిలీ ఫోటో దిగారు.
Also Read : Hanuman : హనుమాన్ సినిమా నుంచి మరో ఆఫర్.. మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేటు బాగా తగ్గించేసి..
దీంతో ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. విజయ్ ని చూడగానే అద్విత ఆశ్చర్యంతో, ఆనందంతో ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడంతో ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అంటూ, దిల్ రాజు కోడలు కూడా విజయ్ దేవరకొండ అభిమాని అంటూ విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ వీడియోని పోస్ట్ చేసి కామెంట్ చేస్తున్నారు.
