Hanuman : హనుమాన్ సినిమా నుంచి మరో ఆఫర్.. మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేటు బాగా తగ్గించేసి..

తాజాగా ప్రేక్షకులకు హనుమాన్ మూవీ యూనిట్ మరో ఆఫర్ ఇచ్చింది.

Hanuman : హనుమాన్ సినిమా నుంచి మరో ఆఫర్.. మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేటు బాగా తగ్గించేసి..

Hanuman Movie unit gives special offer on Multiplex Ticket Prices

Updated On : February 24, 2024 / 9:38 AM IST

Hanuman Movie : ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ(Teja Sajja) హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో అందరికి తెలిసిందే. సంక్రాంతికి చిన్న సినిమాగా రిలీజయినా హనుమాన్ స్టార్ హీరోల సినిమాలని దాటి 300 కోట్లకు పైగా భారీ కలెక్షన్స్ సాధించి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే హనుమాన్ సినిమా కలెక్షన్స్, రన్నింగ్ థియేటర్స్ విషయంలో పలు రికార్డులు సృష్టించింది. ఆల్రెడీ సినిమా రిలీజయి 40 రోజులకు పైగా అవుతుండగా 50 రోజులకు దూసుకుపోతుంది.

ఇప్పటి రోజుల్లో ఓ చిన్న సినిమా ఇన్ని రోజులు ఇన్ని కలెక్షన్స్ తో ఆడటం అంటే మాములు విషయం కాదు. హనుమాన్ సినిమా ఫుల్ ప్రాఫిట్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండటంతో మూవీ యూనిట్ ప్రేక్షకులకు ఆఫర్స్ ఇస్తుంది. ఇటీవల సింగిల్ స్క్రీన్స్ లో బాల్కనీ 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 150 రూపాయలకే టికెట్స్ అందించింది హనుమాన్ యూనిట్.

Also Read : Vennela Kishore : వెన్నెల కిషోర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి ఎందుకు రాడు? కారణం ఇదే..

తాజాగా ప్రేక్షకులకు హనుమాన్ మూవీ యూనిట్ మరో ఆఫర్ ఇచ్చింది. దేశంలోని అన్ని మల్టీప్లెక్స్ లలో కేవలం 112 రూపాయలకే హనుమాన్ టికెట్స్ ని అందిస్తున్నారు. ఇలా వారం రోజుల పాటు ఈ ఆఫర్ కొనసాగనుంది. సినిమా మిస్ అయిన వాళ్ళు చక్కగా ఈ ఆఫర్ తో మల్టీప్లెక్స్ లలో హనుమాన్ సినిమా చూడొచ్చు. త్వరలో హనుమాన్ సినిమా 50 రోజులు పూర్తిచేసుకొని మరో సరికొత్త రికార్డ్ సెట్ చేయనుంది.