Vennela Kishore : వెన్నెల కిషోర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి ఎందుకు రాడు? కారణం ఇదే..

వెన్నెల కిషోర్ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొనడు అని, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి రాడని, పబ్లిక్ ఈవెంట్స్ కి అస్సలు రాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

Vennela Kishore : వెన్నెల కిషోర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి ఎందుకు రాడు? కారణం ఇదే..

Vennela Kishore reveals why he is not attending Movie Pre Release Events

Updated On : February 24, 2024 / 8:56 AM IST

Vennela Kishore : వెన్నెల సినిమాతో ప్రేక్షకులని నవ్వించిన కిషోర్ ఆ సినిమాతో పాపులారిటీ రావడంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నుంచి కమెడియన్ గా మారి వెన్నెల కిషోర్ గా సెట్ అయిపోయాడు. అప్పట్నుంచి కమెడియన్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. మధ్యలో ఓ సినిమా దర్శకత్వం కూడా చేసాడు. ఇప్పుడు త్వరలో చారి 111 అనే సినిమాతో హీరోగా రాబోతున్నాడు.

అయితే వెన్నెల కిషోర్ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొనడు అని, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి రాడని, పబ్లిక్ ఈవెంట్స్ కి అస్సలు రాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది. పలువురు హీరోలు స్టేజిపైనే వెన్నెల కిషోర్ రాలేదు ఈవెంట్ కి అంటూ సరదాగా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే వెన్నెల కిషోర్ ఎందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి, పబ్లిక్ మీటింగ్స్ రాడు అనేది తాజాగా క్లారిటీ ఇచ్చాడు. తన చారి 111 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెన్నెల కిషోర్ యాంకర్ సుమ చేసిన ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడాడు.

Also Read : Bhuma Mounika : బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన భూమా మౌనిక.. పిల్లా ఓ పిల్లా అంటూ మనోజ్..

వెన్నెల కిషోర్ మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటి నుంచి స్టేజి ఫియర్ ఉంది. క్రౌడ్ ని అడ్రెస్ చేయడం చాలా కష్టం. అంతే కాకుండా ఒకరు పొగుడుతుంటే రియాక్షన్ ఏం ఇవ్వాలో నాకు తెలియదు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడేటప్పుడు వాళ్ళు పొగుడుతూ ఉంటారు. ఒక్క మాట అయితే థ్యాంక్స్ చెప్పి వదిలేయొచ్చు. కానీ కంటిన్యూగా పొగిడితే ఏం మాట్లాడాలో, ఎలా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలో నాకు తెలీదు. అలాంటి సమయాల్లో నాకు కొంచెం టెన్షన్ వస్తుంది. అప్పుడు స్టేజి మీద మాట్లాడాలంటే కష్టం అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని అవాయిడ్ చేస్తుంటాను అని తెలిపాడు. ఇక వెన్నెల కిషోర్ హీరోగా వస్తున్న చారి 111 సినిమా మార్చ్ 1న రిలీజ్ కానుంది.