Bhuma Mounika : బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన భూమా మౌనిక.. పిల్లా ఓ పిల్లా అంటూ మనోజ్..

తాజాగా భూమా మౌనిక తన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసింది.

Bhuma Mounika : బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన భూమా మౌనిక.. పిల్లా ఓ పిల్లా అంటూ మనోజ్..

Manchu Manoj Wife Bhuma Mounika shares Baby Bump Photos

Bhuma Mounika : మంచు మనోజ్(Manchu Manoj) భార్య భూమా మౌనిక ప్రగ్నెంట్ అని గత సంవత్సరం డిసెంబర్ లో ప్రకటించారు. ఈ విషయంలో తన కుటుంబం అంతా సంతోషంగా ఉన్నట్టు తెలిపారు మనోజ్. తాజాగా భూమా మౌనిక తన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో బేబీ బంప్ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది మౌనిక. మనోజ్ తో కలిసి దిగిన ఫొటోని కూడా షేర్ చేసింది.

Also Read : Mukhya Gamanika : ‘ముఖ్య గమనిక’ రివ్యూ.. అల్లు అర్జున్ బామ్మర్ది హీరోగా మెప్పించాడా?

బేబీ బంప్ ఫోటోలు షేర్ చేస్తూ.. నా జీవితం, నా పక్కన ఉండే వాళ్ళతో ఎప్పుడూ నన్ను ఆకర్షిస్తుంది. నన్ను మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడేలా చేస్తుంది అంటూ మనోజ్ ని, తన మొదటి కొడుకు ధైరవ్ ని ట్యాగ్ చేసింది. ఈ పోస్ట్ కి మనోజ్ సరదాగా.. పిల్లా ఓ పిల్లా నువ్వంటే నాకు ప్రాణమే అని కామెంట్ చేసాడు. దీంతో భూమా మౌనిక బేబీ బంప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.