Pawan-Kartikeya: పవన్ సార్‌కి మద్దతు ఇవ్వడం నా బాధ్యత.. హీరో కార్తికేయ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా వేడుకలో చేసిన స్పీచ్ ఇప్పుడు సినీ వర్గాలలోనే కాదు.. ఇటు రెండు రాష్ట్రాల..
- Naresh Mannam
- Published on- September 26, 2021 / 05:07 PM IST
Pawan Kartikeya
Pawan-Kartikeya: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా వేడుకలో చేసిన స్పీచ్ ఇప్పుడు సినీ వర్గాలలోనే కాదు.. ఇటు రెండు రాష్ట్రాల రాజకీయాల వర్గాలలో కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఏపీలో అధికార పార్టీని టార్గెట్ చేసిన వ్యాఖ్యలకు.. మంత్రులు, వైసీపీ నేతల నుండి తీవ్రమైన కౌంటర్లు కూడా వస్తున్నాయి. రాజకీయ అంశాలను పక్కనపెడితే.. సినీ పరిశ్రమలో మాత్రం పవన్ వ్యాఖ్యలకు మద్దతు లభిస్తుంది.
Pawan-Mahesh: పవన్ స్పీచ్.. మహేష్ ట్వీట్ వైరల్!
నానీ లాంటి హీరోలు పవన్ కు మద్దతుగా ట్వీట్స్ చేస్తూనే ఏపీలో సినిమా సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు. మరోవైపు పలువురు నటులు, ఇండస్ట్రీలోని ఇతర వర్గాల నుండి కూడా పవన్ వ్యాఖ్యలకు మద్దతు లభిస్తుంది. తాజాగా యువనటుడు హీరో కార్తికేయ కూడా పవన్ కళ్యాణ్‌కి మద్దతు ప్రకటించాడు. నేను ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదా వ్యతిరేకించడం లేదని.. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన సమస్యలు పూర్తిగా అర్ధమయ్యాయి.
Pawan Kalyan : సినీ పరిశ్రమకు ఇబ్బందులు కలిగిస్తే తాట తీస్తా – పవన్ కళ్యాణ్ ఘాటు హెచ్చరిక
నేను పరిశ్రమలో ఒక సభ్యుడు కావడం వల్ల మా అందరి తరపున మాట్లాడిన పవన్ సార్‌కి మద్దతు ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నాను అని యువ కథానాయకుడు కార్తికేయ ట్వీట్ చేశాడు. మరోవైపు పవన్ వ్యాఖ్యలపై సీనియర్ నటుడు మోహన్ బాబు స్పందించి ఓ బహిరంగ లేఖ ద్వారా సమాధానమిచ్చాడు. మొత్తం.. ఏపీలో సినిమాల విడుదల, టికెట్ల అంశం, పవన్ స్పీచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
